బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపటి నుంచి (డిసెంబర్ 26) భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో బాక్సింగ్ డే టెస్ట్ జరుగనుంది. ఈ సిరీస్‌లో ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ టెస్ట్ మ్యాచ్ రెండు టీమ్‌లకు చాలా ముఖ్యమైనది. అయితే.. బాక్సింగ్ డే టెస్టు కోసం ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను టాస్ సమయానికి ప్రకటించనుంది. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో భారత్ జట్టులో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. అంతే కాకుండా.. బ్యాటింగ్ ఆర్డర్‌లో కూడా చేంజస్ చూడవచ్చు. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. శుభ్‌మాన్ గిల్ మూడో నంబర్ నుంచి ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే ఛాన్స్ ఉంది.
Read Also: Bobby Comments : ఆ నిర్మాత అడిగిన బడ్జెట్ ఇవ్వలేదు.. ఎవరంటే..?
పెర్త్ టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ ఆడకపోవడంతో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. వీరిద్దరి మధ్య మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత రోహిత్ ప్లేయింగ్ XIకి తిరిగి రాగానే.. రాహుల్‌నే ఓపెనర్‌గా దింపి.. రోహిత్ నంబర్-6లో బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే.. అడిలైడ్, బ్రిస్బేన్ టెస్టు మ్యాచ్‌లో అనుకున్నంత ప్రదర్శన కనబరచలేకపోయాడు. ఈ క్రమంలో.. నాల్గో టెస్టులో ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. కేఎల్ రాహుల్ మూడవ స్థానంలో బ్యాటింగ్‌కు రావచ్చు. మరోవైపు.. తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డిని ప్లేయింగ్ XI నుండి తప్పించే అవకాశం ఉంది. అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను తీసుకోవచ్చు. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్ ఆల్ రౌండర్లతో బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఆడనుంది.
Read Also: Jasprit Bumrah: టీమిండియా స్టార్ బౌలర్ ఖాతాలో మరో రికార్డు..
టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్: ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ, పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.