బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ శకం ముగిసింది. సీఎం పదవికి మంగళవారం ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్కుు సమర్పించారు. 21 ఏళ్ల పాటు ఆయన బీహార్ సీఎంగా కొనసాగారు. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి తన పూర్తి మద్దతు ఉంటుందని రాజీనామా అనంతరం ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో తదుపరి సీఎం ఎవరనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎం రేసులో బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, నిత్యానందరాయ్ వంటి వారు ముందు వరసలలో ఉన్నారు. బీహార్ కొత్త సీఎం ఎవరనేది సాయంత్రం లోగా వెల్లడికానుంది.