NTV Telugu Site icon

Amit Shah: ప్రధాని పదవి కోసమే నితీష్ కుమార్ ఆర్జేడీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపారు.

Amit Shah

Amit Shah

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీహార సీఎం నితీష్ కుమార్ పై నిప్పులు చెరిగారు. బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా లౌరియాలో జరిగిన ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. మహాగటబంధన్ కూటమి వెనక ప్రధాని ఆశలు ఉన్నాయని నితీష్ కుమార్ ను ఎద్దేవా చేశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రధాని పదవి కోసమే కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)తో చేతులు కలిపారని ఆరోపించారు. తన ప్రధాని కలను నిరవేర్చుకునేందుకే.. బీజేపీతో పొత్తు కాదనుకుని కాంగ్రెస్, ఆర్జేడీతో చేరారని అన్నారు.

ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ను బీహార్ ముఖ్యమంత్రి చేయడానికి జేడీయూ అధిష్టానం అంగీకరించిందని ఆరోపించారు అమిత్ షా. బాల్మీకి లోక్ సభ నియోజకవర్గంలో మాట్లాడిన షా, బీహార్ రాష్ట్రాన్ని ‘జంగిల్ రాజ్’లోకి నెట్టారని నితీష్ కుమార్ పై విమర్శలు గుప్పించారు. ఆయనకు శాశ్వతంగా బీజేపీ తలుపులు మూసేయబడ్డాయని అన్నారు. జయ్ ప్రకాశ్ నారాయణ్ తన జీవితాంతం కాంగ్రెస్, జింగిల్ రాజ్ కు వ్యతిరేకంగా పోరాడారని.. కానీ నితీష్ తన అవసరాల కోసం సోనియాగాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్ లతో పొత్తు పెట్టుకున్నారని, ఆయన వికాసవాది కాదని, అవకాశవాది అని అన్నారు.

Read Also: Dirty Fake Baba: దొంగ బాబా లైంగిక వేధింపులు.. స్త్రీలే లక్ష్యంగా దుర్మార్గపు దందా!

‘ఆయా రామ్‌, గాయరామ్‌’ చాలు, నితీశ్‌కు బీజేపీ తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయని స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కన్నా ఎక్కువ స్థానాలు సాధించిందని, అయితే ప్రధాని మోదీ మరోసారి నితీష్ కుమార్ సీఎం పదవిలో ఉంటారని హామీ ఇచ్చారని, ఆ హామీని కూడా నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు. నితీష్, లాలూలు బీహార్ ను వెనుకబాటు తనం నుంచి బయటకు తీసుకురాలేరని, బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తేనే ఇది సాధ్యం అవుతుందని అన్నారు. జేడీయూ, ఆర్జేడీ పొత్తు నూనె-నీరు వంటిదని, అపవిత్ర పొత్తుగా అభివర్ణించారు.

బీహార్ సరిహద్దులో జనాభా మార్పును నితీష్ కుమార్ ఆపలేరని, 2024లో నరేంద్రమోదీని మూడింట రెండొంతుల మెజారిటీతో మళ్లీ గెలిపించండి, అలాంటి ప్రయత్నాలను తిప్పికొడతామని అన్నారు. ఇదిలా ఉంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ తేజస్వీ యాదవ్ ‘మహాగటబంధన్’ ర్యాలీలో పాల్గొన్నారు. కాంగ్రెస్, వామపక్షాలతో జేడీయూ, ఆర్జేడీ ప్రతిపక్షాల ఐక్యతను చాటాయి. మనల్ని ఎవరు విడదీయలేదరని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు.