Site icon NTV Telugu

Prashant Kishor: నితీష్‌కుమార్‌కు ప్రశాంత్‌ కిషోర్‌ సవాల్‌.. నిజంగా బీజేపీతో సంబంధం లేకుంటే ఆ పని చెయ్..

Prashant Kishor

Prashant Kishor

Prashant Kishor: బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ బీజేపీతో ఇంకా టచ్‌లో ఉన్నారని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన ఈ అంశంపై వ్యాఖ్యానించారు. ఒకప్పుడు జేడీయూలో మిత్రులుగా ఉన్న వీరిద్దరు ప్రస్తుతం బద్ధశత్రువులుగా మారిపోయారు. నితీష్‌ మహాఘట్‌బంధన్‌లో చేరినప్పటికీ ఇంకా బీజేపీతో టచ్‌లో ఉన్నారని పీకే ఆరోపిస్తున్నారు. తాజాగా మరో సవాల్‌ విసిరారు ప్రశాంత్‌ కిషోర్‌. ఒకవేళ నితీష్‌ కుమార్‌ బీజేపీతో కలిసి లేకుంటే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్‌ను తన పదవికి రాజీనామా చేయాల్సిందిగా కోరాలని సవాల్‌ విసిరారు. జేడీయూ ఎంపీ అయిన హరివంశ్‌ ప్రస్తుతం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఎన్డీఏ నుంచి జేడీయూ వైదొలగినప్పుడు ఆ పదవి నుంచి మాత్రం ఎందుకు తప్పుకోలేదని ప్రశ్నించారు. అన్ని సమయాల్లో రెండు మార్గాలు ఉండవు నితీష్‌ జీ అంటూ ప్రశాంత్‌ కిషోర్‌ సైటైర్లు వేశారు.

Jacqueline Fernandez: బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు మధ్యంతర బెయిల్‌ పొడిగింపు

నితీష్‌కుమార్‌ మహాఘట్‌బంధన్‌లో ఉన్నప్పటికీ బీజేపీకి తలుపులు తెరిచే ఉంచారని అందుకు రాజ్యసభ ఛైర్మన్‌ పదవే నిదర్శనమని పీకే అన్నారు. 2024లో ఎన్డీఏ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేస్తామన్న నితీష్‌ మాటలను నమ్మలేమన్నారు. నితీష్‌ కుమార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న 17 ఏళ్లలో 14 ఏళ్లు బీజేపీ మద్దతుతోనే ఆ పదవిలో కొనసాగారని ప్రశాంత్ కిషోర్‌ ఎత్తిచూపారు. బీహార్‌లో మహాఘటబంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తేజస్వి యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్‌తో చేతులు కలపడానికి నితీష్ కుమార్ ఈ ఏడాది ఆగస్టులో బీజేపీని రెండోసారి వదులుకున్నారు.

Exit mobile version