Extra Ordinary Man: ఓటీటీలోకి వచ్చేస్తున్న నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, క్యూట్ బ్యూటీ శ్రీలీల కాంబినేషన్ లో వచిన లేటెస్ట్ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఎక్స్‌ట్రా – ఆర్డినరి మ్యాన్’.ఈ సినిమాకు రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు.విడుదలకు ముందు ఎక్స్‌ట్రా ఆర్డీనరి మ్యాన్ మూవీపై మొదటి నుంచి మంచి అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో డేంజర్ పిల్ల పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్ ట్రైలర్ కూడా ఎంతగానో ఆకట్టుకుంది.ఇలా చాలా గ్రాండ్‌గా ఎన్నో అంచనాలతో ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 8న రిలీజ్ అయింది. కానీ, ప్రేక్షకులు ఊహించనంత రేంజ్ లో సినిమా లేదు. ఈ సినిమాలో కామెడీ ఉన్నా కానీ అంతగా వర్కౌట్ కాలేదని టాక్ వచ్చింది. అంతేకాకుండా రైటర్‌గా వక్కంతం వంశీ బెస్ట్ అని, కానీ డైరెక్షన్ మాత్రం చేయకండి అంటూ కొంతమంది రివ్యూలు కూడా ఇచ్చారు. ఇలా ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది.
ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్ సినిమా రిలీజ్ సమయంలో ఈ సినిమాకు పోటీగా నాని హాయ్ నాన్న కూడా విడుదలైంది. హాయ్ నాన్నకు మంచి రివ్యూస్ రావడం, మరోవైపు ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్ మూవీకి బ్యాడ్ టాక్ రావడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది.దాంతో సినిమాకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్ మూవీ ద్వారా హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా నితిన్‌కు కూడా భారీ నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్ ఓటీటీలోకి రానుంది. దీనికి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్ చిత్రం హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ప్రచారం జరుగుతుంది.. అది కూడా ఈ సంక్రాంతి పండుగ కానుకగా ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13 నుంచి 16 తేదిల్లో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.. అయితే, ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్ ఓటీటీ విడుదలపై అధికారికంగా ప్రకటన ఇంతవరకు రాలేదు. అఫిషీయల్ అనౌన్స్‌మెంట్ వస్తే గానీ.. ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్ ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ అయితే రాదు
Also Read
- AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఎండల సెగ.. నీటి కష్టాలు.? రైతులకు సీఎం అలర్ట్
-
Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్‌లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!