టాలివుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీలా పేరు తెగ వినిపిస్తుంది.. మేనియా ఏ స్థాయిలో కొనసాగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. వచ్చిన రెండేళ్లకే ఆమె టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉంది.. ఏకంగా ఆమె చేతిలో అర డజను సినిమాలలో నటిస్తుంది.. ఇటీవల వచ్చిన సినిమాలు అన్నీ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.. ధమాకా చిత్రం తర్వాత రీసెంట్ గా చేసిన సినిమాలలో ‘భగవంత్ కేసరి సినిమా తప్ప, మిగతా సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో శ్రీలీల పని అయిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.
అమ్మడుకు డ్యాన్స్ తప్ప ఈ అమ్మాయికి ఏమి రాదనీ, ఎక్కువ రోజులు ఇండస్ట్రీ లో కొనసాగదని అంటున్నారు.. ఇదిలా ఉండగా శ్రీలీలా హీరోయిన్ గా నటించిన మరో సినిమా ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.. టాలివుడ్ యంగ్ హీరో గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 8 వ తారీఖున విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు హీరో నితిన్.. ఈ చిత్రం లో శ్రీలీల పాత్ర ఎలా ఉండబోతుంది అని రీసెంట్ ఇంటర్వ్యూ లో అడగగా.. నితిన్ సమాధానం ఇస్తూ ‘ఒక కమర్షియల్ సినిమాలో హీరో, హీరోయిన్ గా నటిస్తే సినిమా హిట్ అయితే పేరు వస్తుంది..
ఇక ఈ సినిమాలో కూడా శ్రీలీల కి అంతే ఉంటుంది. ఆమెది గొప్ప పాత్ర అని నేను చెప్పను, నాలుగు సాంగ్స్ , నాలుగు ఫైట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆమె కనిపిస్తుంది.. ఇక ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రస్తుతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది..నితిన్ చాలా కాలం తర్వాత తనకి తగ్గ సబ్జెక్టు ని ఎంచుకున్నాడు, చాలా ఎంటర్టైన్మెంట్ ఉన్నట్టు ఉంది. కచ్చితంగా ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అని చూసిన ఆడియన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.. ఈ సినిమా మీద ఆయన ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.. మరి నితిన్ ఎలా మెప్పిస్తాడో చూడాలి..