NTV Telugu Site icon

Robinhood Teaser: నితిన్‌ ‘రాబిన్‌హుడ్‌’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్!

Robinhood Teaser

Robinhood Teaser

నితిన్‌ కథానాయకుడిగా, వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాబిన్‌హుడ్‌’. భీష్మ తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న రెండో చిత్రం ఇది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా మేకర్స్‌ రాబిన్‌హుడ్‌ నుంచి స్పెషల్‌ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్‌ను పంచుకున్నారు.

రాబిన్‌హుడ్ టీజర్‌ను నవంబర్ 14న సాయత్రం 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ ఈ టీజర్ అనౌన్స్‌మెంట్‌ను వెల్లడించారు. నితిన్‌ ముసుగేసుకుని చూస్తున్న ఫొటోను పంచుకున్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ మూవీపై అంచనాలను పెంచేశాయి. రాబిన్‌హుడ్ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది.

Also Read: Sai Pallavi: ఆ సినిమా షూట్‌లో ఏడ్చేసిన సాయి పల్లవి.. కారణం ఏంటంటే?

రాబిన్‌హుడ్ చిత్రంలో నితిన్‌ దొంగ పాత్రలో కనిపించనున్నారు. వినోదం, సందేశంతో కూడిన యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతమందిస్తున్నారు. రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిశోర్‌ తదితరులు ఇందులో నటిస్తున్నారు. ఇటీవల వరుస పరాజయాలు ఎందుర్కొంటున్న నితిన్‌ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.

Show comments