Site icon NTV Telugu

Nithin- VI Anand: ‘నో బాడీ.. నో రూల్స్’.. కాన్సెప్ట్ నితిన్ నెక్స్ట్ మూవీ పోస్టర్ రిలిజ్..

Nithiin, Vi Anand, No Body No Rules

Nithiin, Vi Anand, No Body No Rules

యూత్ స్టార్ నితిన్ తాజాగా తన తదుపరి సినిమాను అధికారికంగా ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ వంటి వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వి.ఐ. ఆనంద్ (VI Anand) దర్శకత్వంలో నితిన్ తన కొత్త చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి “NO BODY…NO RULES” అనే పవర్‌ఫుల్ క్యాప్షన్‌తో కూడిన పోస్టర్‌ను పంచుకుంటూ.. “నిజం యొక్క నియమాలు ఇప్పుడే మారిపోయాయి” అంటూ ఆసక్తిని పెంచాడు.

Also Read : Divi Vadthya : పెళ్లి.. విడాకుల కంటే అదే బెటర్.. దివి షాకింగ్ కామెంట్స్!

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా. వి.ఐ. ఆనంద్ సినిమాలు అంటేనే సైన్స్ ఫిక్షన్ లేదా అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగుతుంటాయి. ఇప్పుడు నితిన్‌తో చేయబోయే ఈ చిత్రం కూడా ఏదో ఒక సరికొత్త కాన్సెప్ట్‌తో ఉండబోతున్నట్లు పోస్టర్ చూస్తుంటే అర్థమవుతోంది. ‘నా సోదరుడు వి.ఐ. ఆనంద్ మరియు శ్రీనివాసా గారితో కలిసి ఈ ప్రయాణాన్ని ప్రారంభించడానికి చాలా ఆత్రుతగా ఉన్నాను’ అని నితిన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. నితిన్ తన కెరీర్‌లో ప్రయోగాత్మక చిత్రాలకు మొగ్గు చూపుతున్న తరుణంలో, ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

 

Exit mobile version