Nita Ambani: వామ్మో.. నీతా అంబానీ స్పెషల్ డైమండ్ వాచ్ అన్ని కోట్లా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నీతా అంబానీ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్, ఫ్యాషన్ ఐకాన్ నీతా అంబానీ సాంప్రదాయ లుక్‌తో పాటు,సామాజిక కార్యక్రమాలు, అల్ట్రా- లగ్జరీ లైఫ్‌కి పెట్టింది పేరు… ఆమె వాడే ప్రతి వస్తువు కూడా స్పెషల్ గానే ఉంటుంది.. ఇకపోతే ఖరీదైన చీరలు, నగలు, చెప్పులు, లిప్‌స్టిక్,హ్యాండ్‌బ్యాగ్స్ ఇలా ప్రతి యాక్ససరీకి ఒక ప్రత్యేక ఉంటుంది. ఆసియా కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్యగానే కాదు, ఐపీఎల్ టీం ముంబై ఇండియన్స్‌కి యజమానిగా, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపక చైర్ పర్సన్‌గా ఈమె పేరు గడించింది..
ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె వాడే ప్రతి వస్తువు స్పెషల్ ఫీచర్స్ తో పాటు, ధర కూడా కోట్లల్లోనే ఉంటుంది.. ప్రస్తుతం ఆమె దగ్గర ఉన్న వజ్రాలు పొదిగిన ఖరీదైన వాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. అద్భుతమైన డిజైన్‌తో నీతా అంబానీ పాటెక్ ఫిలిప్ నాటిలస్ 7118/1200ఆర్ వాచ్ లేటెస్ట్ బజ్‌గా నిలిచింది. 18k రోజ్ గోల్డ్ కేస్ , మ్యాచింగ్ బ్రాస్‌లెట్ తో చాలా ఆకర్షనీయంగా కనిపిస్తోంది. చుట్టూ వజ్రాలు పొదిగిన పెర్ల్ డైమండ్-ఎంబెడెడ్ డయల్ స్పెషల్ లుక్ తీసుకొచ్చింది. గోల్డ్ ఒపలైన్ డయల్‌లో పాలిష్ చేసిన పింక్ హ్యాండ్స్, కౌంటర్లు కూడా ఉన్నాయి. ఈ పటేక్ ఫిలిప్ నాటిలస్ విలువ రూ. 1.05 కోట్లుగా తెలుస్తోంది. జాకబ్ మరియు కో ఫ్లూర్స్ డి జార్డిన్ టూర్‌బిల్లాన్ పింక్ సఫైర్స్ వాచ్ విలువ రూ. 4.6 కోట్లు, అలాగే పటేక్ ఫిలిప్ ఆక్వానాట్ రోజ్ గోల్డ్ వాచ్ ధర రూ. 3.2 కోట్లు..
Also Read
- Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
- Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
- Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
- CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
ఇదిలా ఉండగా.. తాను సపోర్ట్ చేస్తున్న IPL జట్టు ముంబై ఇండియన్స్ జెర్సీని ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఆమె చేతికి ఉన్న లగ్జరీ డైమండ్ వాచ్ ధరించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేశాయి. ఖరీదైన బ్లూ కలర్ టాప్ ఎట్రాక్షన్ అని చెప్పవచ్చు. ఈ టాప్‌పై బంగారంతో ఎంబ్రాయిడరీ చేసిన టీ షర్ట్ ను కూడా చూడొచ్చు.. Audemars Piguet రాయల్ ఓక్ క్రోనోగ్రాఫ్ అమెథిస్ట్ డయల్ 26319OR వాచ్ ఖరీదు రూ. 3.1 కోట్లు. క్లీ డి కార్టియర్‌కు చెందిన మరో ఖరీదైన వాచ్ నీతా సొంతం.. ఇవే కాదు డైమండ్ నెక్లేస్,హ్యాండ్‌బ్యాగులు, కార్లు ఇలా లగ్జరీ లైఫ్ స్థయిల్,కాస్ట్లీ వస్తువుల కలెక్షన్ తో ఎప్పుడూ టాక్‌ఆఫ్‌ది టౌన్‌గా నిలుస్తారు.. ఇంకా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ జనాల్లో మంచి ఆదరణను సంపాదించుకుంది
తాజావార్తలు
-
MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
-
Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
-
Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
-
Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!