NTV Telugu Site icon

Kantara : ‘కాంతార’ చూసిన కేంద్రమంత్రి.. రిప్లై ఏమిచ్చారంటే..

New Project (22)

New Project (22)

Kantara : ప్రస్తుతం ఎక్కడ చూసిని కాంతార గురించిన చర్చే కొనసాగుతోంది. ప్రాంతీయతను మరిచిపోయి ఆ సినిమా కథ, హీరో ఫర్మామెన్స్ ను మెచ్చుకుంటున్నారు. బాక్సాఫీసు వద్ద చిత్రం కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. చిన్న సినిమాగా మొదలై ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెడుతోంది. పలువురు ప్రముఖులు సినిమా చూసి చిత్ర బృందాన్ని అభినందిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కాంతార సినిమాపై ప్రశంసల జల్లుకురిపించారు.

Read Also: HIT 2: భయం, సస్పెన్స్.. డబుల్ హిట్ గ్యారెంటీ

బెంగుళూరులో తన వలంటీర్లు, శ్రేయోభిలాషులతో కలిసి బుధవారం థియేటర్లో సినిమా చూశారు. అనంతరం ఆమె సినిమా బాగుందంటూ ట్వీట్ చేశారు. తులువనాడు, కరావళి ప్రాంతంలోని సంప్రదాయాలకు కాంతారా ప్రతీకగా నిలిచిందంటూ మంత్రి మెచ్చుకున్నారు. అక్కడి సంప్రదాయాలను అందంగా చిత్రీకరించారన్నారు. హీరోగా చేస్తూ దర్శకత్వం వహించిన రిషబ్ షెట్టిపై నిర్మలా సీతారామన్ పొగడ్తల వర్షం కురిపించారు. థియేటర్‌లో దిగిన ఫొటోను కేంద్రమంత్రి షేర్‌ చేశారు. ప్రపంచవ్యాప్తంగా కాంతారా భారీగా వసూళ్లను రాబట్టుతూ రికార్డులను తిరగరాస్తోంది. తెలుగులో ఇప్పటికే రూ. 50 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 300 కోట్లకు పైగా రాబట్టి రికార్డు నెలకొల్పింది.

Show comments