NTV Telugu Site icon

Nimmala Ramanaidu : పనుల్లో వేగం కంటే నాణ్యత ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు

Nimmala

Nimmala

Nimmala Ramanaidu : పోలవరం టీడీపీ 72శాతం పూర్తి చేస్తే  వైసీపీ ప్రభుత్వంలో ఎప్పటికీ పూర్తి చేస్తామో చెప్పలేమని చేతులు ఎత్తేసిందన్నారు ఏలూరు మంత్రి నిమ్మల రామానాయుడు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరంలో వైసీపీ సృష్టించిన విధ్వంసం నుంచి ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. వైసీపీ టైం లో దెబ్బ తిన్న డయా ఫ్రమ్ వాల్ స్థలంలో కొత్త వాల్ పనులు జనవరి రెండు నుంచి ప్రారంభమవుతాయన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పనుల్లో వేగం కంటే నాణ్యత ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారని ఆయన తెలిపారు. డి వాల్ పూర్తయ్య వరకు వేచి చూడకుండా నిపుణుల సూచనలతో ఈ సి ఆర్ ఎఫ్ డ్యాం పనులు చేపట్టడంపై చర్చలు జరుగుతున్నాయని, కేంద్రం ఇచ్చిన లక్ష్మీ ప్రకారం 2027 నాటికి పోలవరం పనులు పూర్తి చేయడమే టార్గెట్ అని ఆయన తెలిపారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పూర్తిగా అమలు చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

Vignesh Shivan : మరో వివాదంలో నయనతార భర్త.. అసలు విషయం ఏంటంటే?

Show comments