హాట్ బ్యూటి నిక్కీ తంబోలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ భామ హిందీ బాగ్‌బాస్-14 సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొని ఎంతగానో పాపులర్ అయింది.చీకటి గదిలో చితక్కోట్టుడు సినిమాతో ఈ భామ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత కాంచన-3 చిత్రం ద్వారా కోలీవుడ్ లో కూడా ఎంతగానో అలరించింది.సోషల్ మీడియాలో కూడా ఈ భామ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలు మరియు వీడియోలు షేర్ చేస్తూ తన అభిమానులను ఎంతగానో అలరిస్తోంది.తాజాగా ఆమె షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట బాగా వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఆమెపై క్రేజీ కామెంట్స్ కూడా చేస్తున్నారు. కొందరైతే ఏకంగా పోర్న్ స్టార్ అంటూ దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తనపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నిక్కీ సోషల్ మీడియాలో ట్రోల్స్ తనకేమీ కొత్త కాదని చెప్పుకొచ్చింది.. సోషల్ మీడియాలో తనపై వస్తున్న కామెంట్లను ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్ చేసింది ఈ భామ.నిక్కీ తంబోలి మాట్లాడుతూ.. ‘మీరు నన్ను ఏలాగైనా పిలవండి. కానీ అవీ ఏ విధంగానూ నన్ను దెబ్బ తీయలేవు. సోషల్ మీడియాలో ట్రోల్ కోసమే సమయాన్ని వెచ్చించడమే పనిగా పెట్టుకున్న వ్యక్తుల కోసం నేను ఇక్కడికి రాలేదు. మనం ఎంత స్పందిస్తే..మన పై అంత కంటే ఎక్కువగా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తారు. అందుకే వాటిని నేను అస్సలు పట్టించుకోను. నా పై ట్రోల్ చేసి చేసి ఏదో ఒకరోజు వారికే విసుగు వచ్చి నా పై నెగటివ్ కామెంట్స్ చేయడం మానేస్తారు. అంతే తప్ప వారు చేసే కామెంట్స్ నా జీవితాన్ని ఎలాంటి ప్రభావితం చేయలేవు.’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్నప్పుడు కూడా ఈ భామ ట్రోలింగ్‌కు గురయ్యారు. కాగా.. నిక్కీ తంబోలి బిగ్ బాస్‌తో పాటు.. ఖత్రోన్ కే ఖిలాడి -11 సీజన్‌లో కూడా పాల్గొంది. అంతే కాకుండా ఈ భామ కొన్ని మ్యూజిక్ వీడియోలు కూడా చేసింది. ఈ భామకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది..