టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. కార్తికేయ 2 సినిమాతో నిఖిల్ పాన్ ఇండియా స్థాయిలో ఎంతగానో పాపులర్ అయ్యారు..కార్తికేయ 2 సినిమా తరువాత నిఖిల్ వరుసగా బిగ్గెస్ట్ మూవీస్ లైన్ లో పెట్టాడు ..తన మార్కెట్ రేంజ్ పెరగడంతో ఆ స్థాయిలో తన మూవీస్ వుండే విధంగా చూసుకుంటున్నాడు.. కార్తికేయ 2 తరువాత నిఖిల్ చేసిన స్పై మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు..ప్రస్తుతం నిఖిల్ ‘స్వయంభు’ సినిమాతో బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ను జరుపుకుంటుంది. భరత్ క్రష్ణమాచారి దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మరో హీరోయిన్ నభానటేష్ ఓ కీలక పాత్ర పోషిస్తుంది . ‘స్వయంభు’ మూవీ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో నిఖిల్ ఓ యోధుడిగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రం కోసం అతడు మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీల్లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు.
ఇదిలా ఉంటే నిఖిల్ సిద్దార్థ్ ఇటీవల తండ్రి అయిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో అతడి భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.. అయితే కొడుకు పుట్టి ఇన్ని రోజులు అవుతున్న నిఖిల్ తన కొడుకు పేరును అనౌన్స్ చేయలేదు.తాజాగా ఓ వేడుక లో పాల్గొన్ననిఖిల్ సిద్దార్థ్ తన కొడుకు పేరును అనౌన్స్ చేసారు.అలాగే తాను తండ్రి అయిన తర్వాత తనలో వచ్చిన మార్పుల గురించి కూడా తెలియజేసాడు..నిఖిల్ మాట్లాడుతూ.. మా అబ్బాయి పేరు ధీర సిద్దార్థ్..తండ్రిని అయ్యాక కొన్ని అలవాట్లు పూర్తిగా మానుకున్నాను..ఎక్కువ సమయం కుటుంబం కోసం కేటాయిస్తున్నాను . తండ్రిగా బాబు బాధ్యతను కూడా పంచుకుంటున్నాను. ఎక్కువ సమయం తనతోనే గడపుతున్నాను.గతంలో వారానికి కనీసం ఒక్కసారి అయిన సరే పార్టీకి వెళ్ళేవాడిని .కానీ ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను .. పూర్తిగా వెళ్లడం మానేశాను. తల్లిదండ్రులు అయ్యాక పిల్లల కోసం కొన్నిటిని వదులుకోవాల్సి వస్తుంది. పిల్లల్ని మంచి వాతావరణంలో పెంచాలంటే కొన్నింటికి దూరంగా ఉండాలని అర్ధం చేసుకున్నాను. ఇలా నాలో మార్పు వచ్చిన నేను ఎంతో సంతోషంగా వున్నాను అని నిఖిల్ చెప్పుకొచ్చాడు .