Hero Nikhil Writes a Letter to Fans on Spy Movie Release: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ నటించిన తాజా సినిమా ‘స్పై’. గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్యా మీనన్ కథానాయికగా నటించారు. సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాద మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం.. జులై 29న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. స్పై సినిమాపై డివైడ్ టాక్ వచ్చినా.. ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లో రూ. 28.90 కోట్లు వసూళ్లు చేసింది. నిఖిల్ కెరీర్‌లో ఫాస్ట్‌గా బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాగా స్పై నిలిచింది. అయితే ఇదే సినిమాపై హీరో నిఖిల్ క్షమాపణలు కోరారు. మాట నిలబెట్టుకోలేకపోయానని అభిమానులకు క్షమాపణలు చెప్పారు.
‘నాపై ఉన్న నమ్మకంతో చాలా మంది ఫాన్స్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని టికెట్లు కొన్నారు. నా కెరియర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చారు. నాకు చాలాచాలా సంతోషంగా ఉంది. అయితే కొంత బాధ కూడా ఉంది. కాంట్రాక్ట్, కంటెంట్ విషయాల్లో వచ్చిన సమస్యల కారణంగా పాన్ ఇండియా స్థాయిలో స్పై సినిమాను విడుదల చేయలేకపోయాం. ఓవర్సీస్లో కూడా 350 వరకు తెలుగు ప్రీమియర్ షోలు రద్దు అయ్యాయి. హిందీ, కన్నడ, తమిళం, మలయాళ ప్రేక్షకులకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెపుతున్నా’ అని నిఖిల్ పేర్కొన్నారు.
‘కార్తికేయ 2 సినిమాతో మీకు దగ్గరయ్యా. స్పై సినిమాను మాత్రం మీకు అందించలేకపోయా. నా నుంచి రాబోయే 3 సినిమాలను అన్ని భాషల్లోని థియేటర్‌లలో అనుకున్న సమయానికే విడుదల అవుతాయని మాట ఇస్తున్నా. నాపై నమ్మకం ఉంచిన తెలుగు సినిమా అభిమానులకు కూడా మాటిస్తున్నా. ఇకపై సినిమా క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీపడను. నాపై ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా.. మంచి కంటెంట్ ఉన్న సినిమాను అందిస్తా’ అని నిఖిల్ లేఖలో రాసుకొచ్చారు.
Also Read: Niharika-Chaitanya Divorce: విడాకులపై స్పందించిన నిహారిక.. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్!