Site icon NTV Telugu

Heavy Floods: ముంచెత్తిన వరదలు.. 600 మంది మృతి

Nigeria Floods

Nigeria Floods

Heavy Floods: ఆఫ్రికా దేశమైన నైజీరియాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొద్దీ రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహించడం వల్ల పలు పట్టణాలు, గ్రామాలు వరదల్లో మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో వివిధ ప్రమాదాల్లో దాదాపు 600 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వ సాయం కోసం లక్షల మంది ఎదురుచూస్తున్నారు. నైజీరియా చరిత్రలోనే ఇదే అతిపెద్ద విపత్తు అని అక్కడి అధికారులు తెలిపారు. దాదాపు 10 ఏళ్ల క్రితం సంభవించిన వరదల్లో 360 మంది ప్రాణాలు కోల్పోగా.. 2లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు.

CM KCR Suffering From Fever: సీఎం కేసీఆర్‌కు జ్వరం.. మరో నాలుగు రోజులు ఢిల్లీలోనే..!

నైజీరియాలో వరదలు సృష్టించిన బీభత్సం కారణంగా 13లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 2లక్షల నివాసాలు దెబ్బతిన్నాయి. దాదాపు 2.72 లక్షల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. సహాయక బృందాలు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా వరదలు ముంచెత్తుతున్నా అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో మృతుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. నైజీరియాలో ప్రతీ ఏటా వరదలు సంభవించినప్పటికీ.. ఈసారి మాత్రం భారీ విపత్తు సంభవించింది.

Exit mobile version