Site icon NTV Telugu

Exchange of Old Notes : పాత కరెన్సీ నోట్ల మార్పిడి గడువును పొడగించిన బ్యాంక్

Old Notes

Old Notes

Exchange of Old Notes : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ నైజీరియా (CBN) పాత నైరా కరెన్సీ నోట్ల మార్పిడికి గడువును పొడిగించింది. పాత నోట్లను మార్చుకునేందుకు 10 రోజుల పాటు సమయాన్ని ఇచ్చింది బ్యాంక్. నైజీరియన్లు ఫిబ్రవరి 10 వరకు తమవద్ద ఉన్న 1,000, 500, 200 నైరా నోట్లను పునరుద్ధరించుకోవచ్చు. గడువు పొడిగింపు గ్రామీణ ప్రాంతాల వారికి మరింత సౌకర్యవంతంగా ఉంటుందని CBN గవర్నర్ గాడ్విన్ ఎమిఫైల్ తెలిపారు.

Read Also: Tech Layoffs: ఆరువేల మందిని తొలగించిన ఫిలిప్స్ సంస్థ

నైజీరియా సెంట్రల్ బ్యాంక్ గత నెలలో కొత్తగా రూపొందించిన నోట్లను జారీ చేయడం ప్రారంభించింది. అయితే అవి బ్యాంకులు లేదా యంత్రాల వద్ద అందుబాటులో లేవని విస్తృతంగా ఫిర్యాదులు వచ్చాయి. నోట్ల మార్పిడికి రేపు చివరి రోజు. కానీ పౌరులు తమ వద్ద ఉన్న నోట్లను పూర్తి స్థాయిలో మార్చుకోలేకపోయారని గుర్తించిన తర్వాత CBN కాలపరిమితిని పొడిగించింది. ఈ పొడగింపు చాలా బ్యాంకుల వద్ద ప్రజలు పొడవైన క్యూలలో నిలబడాల్సిన పరిస్థితిని దూరం చేసినట్లైంది.

Read Also: Gautam Gambhir: ‘ఆట మార్చుకో’.. ఇషాన్‌కు వార్నింగ్ ఇచ్చిన గంభీర్

ఇదిలా ఉండగా, నైజీరియా నైరా నోట్ల రీడిజైన్‌ను నిపుణులు విమర్శించారు. ఆఫ్రికాలోని అత్యధిక జనాభా కలిగిన దేశం నైజీరియా.. తన పాత కరెన్సీని దశలవారీగా తొలగించే ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయగలదా అని వారు సందేహాన్ని వ్యక్తపరిచారు. అందుకు ఆరువారాల సమయం సరిపోదని అభిప్రాయపడ్డారు. కొత్త నోట్లు సరిపడా చలామణిలో లేవని, ప్రజలు వాటిని బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసుకోలేకపోతున్నారని స్థానిక మీడియా పేర్కొంది.

Read Also: Ys Jagan Mohan Reddy: పొత్తులపై జగన్ హాట్ కామెంట్స్

నోట్ల మార్పు దేశంలోని కరెన్సీపై స్పష్టమైన అవగాహన కల్పించడంతో పాటు డిజిటల్ చెల్లింపులను అంగీకరించేలా నైజీరియన్లను ప్రోత్సహిస్తుందని CBN పేర్కొంది. మరికొద్ది వారాల్లో దేశంలో అధ్యక్ష, పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్న తరుణంలో కరెన్సీ మార్పు జరగడం కూడా గమనార్హం.

Exit mobile version