Video Viral: నాలుగు సిక్సర్ల తుఫాన్.. పూరన్‌కు వంగి సెల్యూట్ చేసిన ముకుల్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nicholas Pooran – Mukul Chaudhary: గ్రౌండ్ లో తన బ్యాటింగ్ తో విద్వంసానికి పేరు పొందిన నికోలస్ పూరన్ ఐపీఎల్ 2026లో మరోసారి తన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అసాధారణ హిట్టింగ్తో లక్నో సూపర్ జెయింట్స్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. ముఖ్యంగా అన్షుల్ కాంబోజ్ వేసిన ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది మ్యాచ్‌ను ముగించాడు. లక్నో జట్టు విజయానికి చివరి నాలుగు ఓవర్లలో 24 పరుగులు అవసరమైన సమయంలో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది.
అప్పటికే మిచెల్ మార్ష్ 38 బంతుల్లో 90 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అలాగే సమాద్ కూడా త్వరగా పెవిలియన్ చేరడంతో లక్నోపై ఒత్తిడి పెరిగింది. పూరన్ కూడా ఆ సమయానికి అంతగా లయలో కనిపించలేదు. అయితే అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌కు వచ్చిన వెంటనే మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. తన సహజ శైలిలో దూకుడుగా ఆడిన పూరన్ వరుసగా నాలుగు భారీ సిక్సర్లు బాది చెన్నైకు పరాజయాన్ని మూటగట్టాడు. కేవలం నాలుగు బంతుల్లోనే మ్యాచ్‌ను ముగించి లక్నోకు 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందించాడు.
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
ఈ సమయంలో నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న ముకుల్ చౌదరి పూరన్ బ్యాటింగ్‌ను దగ్గర నుంచి ఆస్వాదించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత గ్రౌండ్ లోనే పూరన్‌కు నమస్కరిస్తూ వంగి అభినందించిన ముకుల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనంతరం పూరన్ అతడిని హత్తుకున్నాడు. మరోవైపు ఈ ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్లేఆఫ్స్ అవకాశాలకు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటికే కఠిన పరిస్థితుల్లో ఉన్న చెన్నైకి ఈ పరాజయం మరింత ఒత్తిడిని తెచ్చింది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి రేస్ లో లీనప్పటికీ, చెన్నై ఆశలను దెబ్బ తీసిందని చెప్పాలి.
Stormed to 2️⃣ points in absolute style 😎@LucknowIPL wrap a blistering chase at home 🏡
Scorecard ▶️ https://t.co/v1R8RJXPe8#TATAIPL | #KhelBindaas | #LSGvCSK pic.twitter.com/EwqhdUW1L5
— IndianPremierLeague (@IPL) May 15, 2026
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!