Site icon NTV Telugu

Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి కేసు పగ్గాలు స్వీకరించిన NIA..

Nia

Nia

ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కి అప్పగించింది. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా దాని ఫ్రంట్ ఆర్గనైజేషన్ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (TRF) ఈ దాడి చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ దాడి వెు పాక్ హస్తం ఉందనే బలమైన వాదనలు వినిపిస్తున్నాయి.

READ MORE: Indian Navy: దేనికైనా రెడీ.. యాంటీ షిప్‌ మిసైల్స్‌ను పరీక్షించిన భారత నౌకాదళం!

పహల్గాం దాడిపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తుందని హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌ఐఏ ఇప్పుడు ఈ కేసును జమ్మూ కశ్మీర్ పోలీసుల నుంచి స్వాధీనం చేసుకునే ప్రక్రియలో ఉంది. ఈ దాడి వెనుక ఉన్న విస్తృత ఉగ్రవాద నెట్‌వర్క్, కుట్రను వెలికితీసేందుకు సంస్థ లోతైన దర్యాప్తు ప్రారంభించనుంది. ఇప్పటికే ఘటనా స్థలంలో ఎన్‌ఐఏ బృందం ఆధారాలు సేకరిస్తోంది. ఈ బృందంలో ఉగ్రవాద వ్యతిరేక ఏజెన్సీకి చెందిన ఐజీ, డీఐజీ, ఎస్పీ ఉన్నారు. ఉగ్రదాడిని చూసిన సాక్షులను అధికారులు ప్రశ్నించనున్నారు.

READ MORE: Virat Kohli vs KL Rahul: ఊరమాస్ లెవెల్‌లో రాహుల్ వార్నింగ్.. ప్రతీకారానికి సిద్దమైన కోహ్లీ!

దాడి నుంచి బయటపడిన వారి వాంగ్మూలాలను నమోదు చేయనుంది. అలాగే.. లష్కరే, జైష్-ఎ-మొహమ్మద్, ఇతర ఉగ్రవాద సంస్థలకు చెందిన అరెస్టయిన ఉగ్రవాదులను ఈ దాడిపై ప్రశ్నిస్తుంది. పలు ఆధారాల ద్వారా ఈ దాడిలో పాకిస్థాన్ ప్రత్యక్ష ప్రమేయం ఉందని భారత్ నిర్ధారిస్తోంది. కాగా.. బైసరన్ లోయలో 26 మంది అమాయక పౌరులను చంపిన వారి కోసం ఇప్పటికే భారత సైన్యం, సీఆర్‌పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసుల సంయుక్త దళం వెతుకుతోంది.

Exit mobile version