Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International Sports New Zealand Won The Toss And Opted To Bowl Against India In The 2nd Odi

Ind vs Nz: న్యూజిలాండ్‌తో రెండో వన్డే.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్

Published Date :November 27, 2022 , 7:15 am
By Mahesh Jakki
Ind vs Nz: న్యూజిలాండ్‌తో రెండో వన్డే..  టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ind vs Nz: హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. సంజూ శాంసన్‌, శార్దూల్‌ ఠాకూర్‌ల స్థానంలో దీపక్‌ హుడా, దీపక్‌ చాహర్‌లను తీసుకురావడంతో భారత్‌ రెండు మార్పులు చేసింది. ఆదివారం జరిగే మూడు వన్డేల సిరీస్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన రెండో వన్డేలో న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతోంది. మొదటి వన్డేలో బ్లాక్‌క్యాప్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. టామ్ లాథమ్ 104 బంతుల్లో 145 నాటౌట్‌గా నిలవడంతో కివీస్ తొలి వన్డేలో భారత్‌పై 307 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ మ్యాచ్ సిరీస్‌ ఫలితంతోపాటు ఐసీసీ వన్డే సూపర్‌ లీగ్‌ పాయింట్లపైనా ప్రభావం చూపనుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలిస్తే సిరీస్‌ రేసులో నిలబడుతుంది. ఒక వేళ ఓడితే మాత్రం సిరీస్‌తోపాటు సూపర్‌ లీగ్‌లో రెండో స్థానానికి పడిపోవడం ఖాయం. తొలి వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో టీమ్‌ఇండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. 300కిపైగా పరుగులు సాధించినా కాపాడుకోవడంలో బౌలర్లు విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. అయితే తొలి వన్డేలో పరాజయం పాలైనప్పటికీ ఐసీసీ వరల్డ్‌ కప్‌ సూపర్ లీగ్‌ పాయింట్ల టేబుల్‌లో భారత్‌ స్థానం మాత్రం మారలేదు. అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో మళ్లీ న్యూజిలాండ్‌ గెలిస్తే మాత్రం టీమ్‌ఇండియా రెండో స్థానానికి పడిపోవడం ఖాయం. అలాగే సిరీస్‌ కూడా కివీస్‌ సొంతమవుతుంది. ప్రస్తుతం భారత్‌ 19 మ్యాచుల్లో 13 విజయాలు, 6 ఓటములతో 129 పాయింట్లు సాధించింది. ఐసీసీ రూల్స్‌ ప్రకారం ఒక్క విజయానికి పదేసి పాయింట్లు వస్తాయి.

China Covid: భగ్గుమన్న షింజియాంగ్.. భారీ స్థాయిలో నిరసనలు

ఈ లెక్కన టీమ్‌ఇండియా ఖాతాలో 130 పాయింట్లకు బదులు 129 మాత్రమే ఉండటానికి కారణం పెనాల్టీ ఓవర్‌. ఎన్ని పెనాల్టీ ఓవర్లు వేస్తే అన్ని పాయింట్లు కోత పడతాయి. అలాగే మ్యాచ్‌ రద్దు అయితే ఇరు జట్లకూ చెరో ఐదేసి పాయింట్లు వస్తాయి. ఈ క్రమంలో భారత్‌కు ఒక పెనాల్టీ ఓవర్‌ ఉండటంతో ఒక పాయింట్‌ తగ్గింది. మరోవైపు న్యూజిలాండ్ 16 మ్యాచుల్లో 12 విజయాలు, నాలుగు ఓటములతో 120 పాయింట్లతో ఉంది. ఒక వేళ రెండో వన్డేలో కివీస్‌ విజయం సాధిస్తే.. అప్పుడు 130 పాయింట్లకు వెళ్లిపోతుంది. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న భారత్‌ రెండో స్థానానికి పడిపోతుంది. ఐసీసీ పాయింట్ల పట్టికలో టాప్‌-8 జట్లు భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తాయి. మిగిలిన ఐదు జట్లు క్వాలిఫయిర్‌ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఈసారి 13 జట్లు బరిలోకి దిగబోతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ind vs nz
  • Ind vs Nz 2nd odi
  • india
  • India vs New Zealand
  • Kane Williamson

తాజావార్తలు

  • Ashok Sharma: ఎవరయ్య ఈ ‘స్పీడ్ గన్’ బౌలర్.. 154.2 కిలోమీటర్ల వేగంతో బెంబేలు ఎత్తించాడుగా..!

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions