వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. ఇష్ సోధి స్థానంలో లోకీ ఫెర్గూసన్ న్యూజిలాండ్ టీమ్ లోకి రాగా.. శ్రీలంక జట్టులో కసున్ రజిత స్థానంలో చమిక కరుణరత్నే ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
Read Also: Delhi : ఢిల్లీలో దారుణం.. ముగ్గురు అన్నదమ్ములను కత్తితో పొడిచిన దుండగులు
అయితే, ఈ మ్యాచ్ లో కివీస్ గెలిస్తే సెమీస్ కు వెళ్లే అవకాశాలు మెరుగు పడతాయి. ఓడిపోతే సెమీస్ అవకాశాలు మరింత క్లిష్టతరంగా మారే ఛాన్స్ ఉంది. దీంతో ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలవలనే పట్టుదలో న్యూజిలాండ్ టీమ్ ఉంది. ఇక, ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉండడంతో కివీస్ ను కలవరపెడుతోంది. ఈ టోర్నమెంట్ లో తొలి నాలుగు విజయాలు సాధించిన తర్వాత నాలుగు మ్యాచ్ లలో వరుసగా ఓడిపోయింది. న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది.
Read Also: Kajal Agarwal : బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయనున్న చందమామ..?
తుది జట్లు..
న్యూజిలాండ్ జట్టు: డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్..
శ్రీలంక జట్టు: పాతుమ్ నిస్సాంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్ (కెప్టెన్/వికెట్‌కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ్ డి సిల్వా, మహేశ్ తికాషా, దుష్మంత చమీర, చమిక కరుణరత్నే, దిల్షన్ మధుశంక..
