NTV Telugu Site icon

NZ W vs SA W: ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్- 2024 విజేత న్యూజిలాండ్..

Nz

Nz

ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్-సౌతాఫ్రికా మధ్య జరిగింది. టైటిల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 32 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో.. ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్-2024 విజేతగా న్యూజిలాండ్ అవతరించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటింగ్‌లో అమేలియా కెర్ అత్యధికంగా (43) పరుగులు చేసింది. ఆ తర్వాత.. బ్రూక్ (38), బేట్స్ (32) పరుగులతో రాణించారు. సౌతాఫ్రికా బౌలింగ్‌లో మ్లాబా రెండు వికెట్లు తీసింది. ఆ తర్వాత.. ఖాకా, ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్ తలో వికెట్ పడగొట్టారు.

Read Also: Jammu Kashmir: వలస కార్మికులపై ఉగ్రవాదుల కాల్పులు.. ముగ్గురు మృతి..

159 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. ఆరంభంలో ఓపెనర్లు అద్భుతంగా రాణించినప్పటికీ.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో.. సౌతాఫ్రికా ఓటమి పాలైంది. సౌతాఫ్రికా బ్యాటింగ్‌లో లారా వోల్వార్డ్ట్ అత్యధికంగా (33) పరుగులు చేసింది. ఆ తర్వాత.. తంజీన్ బ్రిట్స్ (17), చోలే ట్రైయాన్ (14), అన్నేకే బోష్ (9), మారిజాన్ కాప్ (8), సునే లూస్ (8) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో అమేలియా కెర్, రోజ్మేరీ మెయిర్ చెరో 3 వికెట్లతో చెలరేగారు. ఈడెన్ కార్సన్, ఫ్రాన్ జోనాస్, బ్రూక్ హాలిడే తలో వికెట్ పడగొట్టారు. కాగా.. న్యూజిలాండ్ తొలి టీ20 వరల్డ్ కప్ ను సాధించింది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా ఆరుసార్లు.. ఇంగ్లండ్, వెస్టిండీస్ ఒక్కోసారి టీ20 వరల్డ్ కప్ సాధించాయి.

Read Also: Sonia Gandhi: కూతురి కోసం రంగంలోకి సోనియా గాంధీ..