NTV Telugu Site icon

NZ vs ENG: భారీ తేడాతో న్యూజిలాండ్ విజయం.. సిరీస్ కైవసం చేసుకున్న ఇంగ్లండ్‌

Nz Vs Eng

Nz Vs Eng

NZ vs ENG: న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ముగిసిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ 423 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అయితే, తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ గెలవడంతో సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ చివరి టెస్టు మ్యాచ్ టిమ్ సౌతీ కెరీర్‌లో చివరిది. ఈ మ్యాచ్‌లో అతను 2 వికెట్లు తీసి తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్ 423 పరుగుల తేడా విజయంతో టెస్టు మ్యాచ్‌లో అతిపెద్ద విజయం సాధించింది. సిరీస్ మొత్తం అత్యుత్తమ ప్రదర్శన చూపించిన హ్యారీ బ్రూక్ “ప్లేయర్ ఆఫ్ ది సిరీస్” అవార్డును అందుకోగా, మిచెల్ సాంట్నర్ తన ఆల్‌రౌండ్ ప్రదర్శనకు “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డును అందుకున్నాడు.

Also Read: Online Betting Suicide: పబ్జి గేమ్ ద్వారా పరిచయం.. ఆన్లైన్ బెట్టింగ్ ఉచ్చుకు నిండు ప్రాణం బలి

ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 347 పరుగులు సాధించింది. ఇందులో మిచెల్ సాంట్నర్ 76 పరుగులు, టామ్ లాథమ్ 63 పరుగులు, కేన్ విలియమ్సన్ 44 పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో మాథ్యూ పాట్స్ 4 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్‌ లో ఇంగ్లండ్ జట్టు 143 పరుగులకే కుప్పకూలింది. మాట్ హెన్రీ 4 వికెట్లు తీసి ఇంగ్లండ్ ను దెబ్బ తీయగా.. విల్ ఒరూర్క్, మిచెల్ సాంట్నర్ తలో 3 వికెట్లు తీశారు. 204 పరుగుల భారీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ, న్యూజిలాండ్ ఇంగ్లండ్‌కు ఫాలోఆన్ ఇవ్వకుండా తమ వ్యూహాన్ని కొనసాగించింది.

Also Read: BRS Protest: చేతికి బేడీలు, నల్ల చొక్కాలతో బీఆర్ఎస్ వినూత్న నిరసన..

న్యూజిలాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో కేన్ విలియమ్సన్ అదరగొట్టే ప్రదర్శనతో 156 పరుగులు చేసి సెంచరీ సాధించాడు. డారిల్ మిచెల్ 60 పరుగులు చేసి తన వంతు పాత్ర పోషించారు. మిచెల్ సాంట్నర్ 49 పరుగులు చేయగా.. రచిన్ రవీంద్ర, టామ్ బ్లండెల్ తలో 44 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కి మద్దతుగా నిలిచారు. ఈ ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ మొత్తం 453 పరుగులు చేసి ఇంగ్లాండ్ ముందు 658 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే, లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ జట్టు 234 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విధంగా కివీస్ జట్టు 423 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ తరఫున జాకబ్ బెతెల్ 76 పరుగులు చేయగా, జో రూట్ 54 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 4 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు.

Show comments