NTV Telugu Site icon

Kane Williamson: టీమిండియా సూపర్.. చాలా గర్వంగా ఉంది: కేన్‌ విలియమ్సన్‌

Kane Williamson Interview

Kane Williamson Interview

New Zealand Captain Kane Williamson Says Team India Players Super: భారత్ టాప్ క్లాస్ జట్టు అని, గొప్ప క్రికెట్ ఆడిందని న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అన్నాడు. వన్డే ప్రపంచకప్‌ 2023లో సెమీస్ చేరిన టీమిండియాకు అభినందనలు తెలిపాడు. న్యూజిలాండ్‌ నాకౌట్‌లో అవుట్ కావడం తమని నిరాశపరిచిందని కేన్‌ చెప్పాడు. ముంబై వేదికగా టీమిండియాతో జరిగిన తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌ 70 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఈ విజయంతో గత వరల్డ్‌కప్‌ సెమీస్‌లో ఎదురైన పరాభవాని​కి ప్రతీకారం తీర్చుకున్నా భారత్.. నాలుగోసారి ప్రపంచకప్‌ ఫైనల్లో ప్రవేశించింది.

మ్యాచ్ అనంతరం కేన్‌ విలియమ్సన్‌ మాట్లాడుతూ… ‘వన్డే ప్రపంచకప్‌ 2023 సెమీస్ చేరిన టీమిండియాకు అభినందనలు. భారత్ టోర్నీ ఆసాంతం గొప్ప క్రికెట్ ఆడింది. ఈరోజు అయితే అత్యుత్తమ ఆట ఆడింది. టీమిండియా అగ్రశ్రేణి జట్టు, ప్లేయర్స్ అగ్ర క్రికెట్ ఆడారు. మా ప్లేయర్స్ సైతం అద్భుతంగా పోరాడారు. మా పోరాటం​ పట్ల గర్వంగా ఉంది. కుర్రాళ్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. అయితే మరోసారి నాకౌట్‌ నుంచే నిష్క్రమించడం నిరాశపరిచింది. భారత్ మాకంటే బెటర్‌ గేమ్‌ ఆడింది. టీమిండియాను ఆపడం కష్టమే’ అని అన్నాడు.

Also Read: Mohammed Shami: ఆ క్యాచ్‌ను వదిలేసినప్పుడు చాలా బాధపడ్డా.. నా వంతు కోసం వేచి చూశా: షమీ

‘భారత్ టాప్ క్లాస్ జట్టు. ప్రపంచ స్థాయి బ్యాటర్లు జట్టులో ఉన్నారు. అందరూ బాగా బ్యాటింగ్ చేశారు. అందుకే 400 పరుగులు (397) చేశారు. బంతి స్వింగ్ అవుతున్నప్పుడు ఈ స్కోర్‌ను ఛేజ్‌ చేయడం చాలా కష్టం. అయినా మేం అద్భుతంగా పోరాడాం. భారత బౌలర్లకు క్రెడిట్‌ దక్కుతుంది. మాపై పైచేయి సాధించారు. మ్యాచ్‌ ఏకపక్షంగా సాగింది. జట్టుగా మాకు ఆట పట్ల నిజమైన నిబద్ధత ఉంది. గెలుపు కోసం చేయాల్సిన ప్రయత్నం చేశాం కానీ కుదరలేదు. ఈ ఎడిషన్‌లో రచిన్, మిచెల్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. బౌలర్లు కాస్త తడబడ్డారు. అయితే జట్టు ప్రదర్శన బాగుంది. ఇక్కడ ప్రేక్షకులు అద్భుతం. వారు మమ్మల్ని ఆదరించారు. భారత్ ఆతిథ్యం అద్భుతం’ అని కేన్‌ విలియమ్సన్‌ చెప్పాడు.

Show comments