Kane Williamson: టీమిండియా సూపర్.. చాలా గర్వంగా ఉంది: కేన్ విలియమ్సన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Zealand Captain Kane Williamson Says Team India Players Super: భారత్ టాప్ క్లాస్ జట్టు అని, గొప్ప క్రికెట్ ఆడిందని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో సెమీస్ చేరిన టీమిండియాకు అభినందనలు తెలిపాడు. న్యూజిలాండ్ నాకౌట్లో అవుట్ కావడం తమని నిరాశపరిచిందని కేన్ చెప్పాడు. ముంబై వేదికగా టీమిండియాతో జరిగిన తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ 70 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఈ విజయంతో గత వరల్డ్‌కప్ సెమీస్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నా భారత్.. నాలుగోసారి ప్రపంచకప్ ఫైనల్లో ప్రవేశించింది.
మ్యాచ్ అనంతరం కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ… ‘వన్డే ప్రపంచకప్ 2023 సెమీస్ చేరిన టీమిండియాకు అభినందనలు. భారత్ టోర్నీ ఆసాంతం గొప్ప క్రికెట్ ఆడింది. ఈరోజు అయితే అత్యుత్తమ ఆట ఆడింది. టీమిండియా అగ్రశ్రేణి జట్టు, ప్లేయర్స్ అగ్ర క్రికెట్ ఆడారు. మా ప్లేయర్స్ సైతం అద్భుతంగా పోరాడారు. మా పోరాటం పట్ల గర్వంగా ఉంది. కుర్రాళ్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. అయితే మరోసారి నాకౌట్ నుంచే నిష్క్రమించడం నిరాశపరిచింది. భారత్ మాకంటే బెటర్ గేమ్ ఆడింది. టీమిండియాను ఆపడం కష్టమే’ అని అన్నాడు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
Also Read: Mohammed Shami: ఆ క్యాచ్‌ను వదిలేసినప్పుడు చాలా బాధపడ్డా.. నా వంతు కోసం వేచి చూశా: షమీ
‘భారత్ టాప్ క్లాస్ జట్టు. ప్రపంచ స్థాయి బ్యాటర్లు జట్టులో ఉన్నారు. అందరూ బాగా బ్యాటింగ్ చేశారు. అందుకే 400 పరుగులు (397) చేశారు. బంతి స్వింగ్ అవుతున్నప్పుడు ఈ స్కోర్‌ను ఛేజ్ చేయడం చాలా కష్టం. అయినా మేం అద్భుతంగా పోరాడాం. భారత బౌలర్లకు క్రెడిట్ దక్కుతుంది. మాపై పైచేయి సాధించారు. మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. జట్టుగా మాకు ఆట పట్ల నిజమైన నిబద్ధత ఉంది. గెలుపు కోసం చేయాల్సిన ప్రయత్నం చేశాం కానీ కుదరలేదు. ఈ ఎడిషన్‌లో రచిన్, మిచెల్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. బౌలర్లు కాస్త తడబడ్డారు. అయితే జట్టు ప్రదర్శన బాగుంది. ఇక్కడ ప్రేక్షకులు అద్భుతం. వారు మమ్మల్ని ఆదరించారు. భారత్ ఆతిథ్యం అద్భుతం’ అని కేన్ విలియమ్సన్ చెప్పాడు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..