NZ World Cup Squad: వెరైటీగా జట్టును ప్రకటించిన న్యూజిలాండ్ బోర్డు.. సతీమణులు, పిల్లలతో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Zealand Squad for ICC ODI World Cup 2023: అక్టోబర్ 5 నుంచి భారత గడ్డపై జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టుని సోమవారం వెరైటీగా ప్రకటించింది. ప్రపంచకప్ 2023 జట్టును న్యూజిలాండ్ ఆటగాళ్ల కుటుంబ సభ్యులు ప్రకటించారు. ‘161 మై డాడీ.. కేన్ విలియమ్సన్’ అని విలియమ్సన్ పిల్లలు వీడియోలో ముందుగా చెప్పారు. ట్రెంట్ బౌల్ట్ కుమారుడు, మార్క్ చాప్మన్ సతీమణి, డెవాన్ కాన్వే భార్యలు వీడియోలో మాట్లాడారు.
న్యూజిలాండ్ ఆటగాళ్ల కుటుంబ సభ్యులు జట్టుని ప్రకటించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యూజిలాండ్ జట్టుకు కేన్ విలియమ్సన్ కెప్టెన్ కాగా.. టామ్ లాథమ్ వైస్ కెప్టెన్. న్యూజిలాండ్ సెలెక్టర్లు ఫిన్ అలెన్ బదులుగా విల్ యంగ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన పేసర్లు కైల్ జేమీసన్, ఆడమ్ మిల్నేలకు చోటు దక్కలేదు. సెంట్రల్ కాంట్రాక్ట్ లేకుండా ట్రెంట్ బౌల్ట్ మరియు జేమ్స్ నీషమ్ జట్టులోకి వచ్చారు.
Also Read
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్ మరియు మాట్ హెన్రీలతో న్యూజిలాండ్ పేస్ విభాగం పటిష్టంగా ఉంది. ఆల్ రౌండర్ కోటాలో డారిల్ మిచెల్ మరియు జేమ్స్ నీషమ్ ఉన్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా ఇష్ సోధీ, మిచెల్ సాంట్నర్ చోటు దక్కిచుకున్నారు. కేన్ విలియమ్సన్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్ స్పెషలిస్ట్ బాటర్లుగా ఉన్నారు. ఇక అన్ని జట్లకు సెప్టెంబర్ 28 వరకు తమ 15 మంది ఆటగాళ్ల జట్టును ఖరారు చేసుకునే అవకాశం ఉంది. ఈ తేదీ తర్వాత ఏ ఆటగాడినైనా భర్తీ చేయాలంటే ఐసీసీ అనుమతి అవసరం.
Also Read: India vs Pakistan: జస్ప్రీత్ బుమ్రాకు సర్‌ప్రైజ్ గిప్ట్ ఇచ్చిన పాక్ పేసర్.. వీడియో వైరల్!
న్యూజిలాండ్ జట్టు:
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్ (కీపర్), డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌతీ, విల్ యంగ్.
Family members of New Zealand announcing the World Cup 2023 squad.
Cutest video on the Internet.pic.twitter.com/QXTBGAVlqR
— Johns. (@CricCrazyJohns) September 11, 2023
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!