NTV Telugu Site icon

US Spy Satellite: రష్యా-చైనా ఉపగ్రహాలపై అమెరికా స్పై శాటిలైట్ ఫోకస్..

Us Spy Satellite

Us Spy Satellite

చైనా-రష్యా అంతరిక్ష వాహనాలను ట్రాక్ చేయడానికి యూఎస్ స్పేస్ ఫోర్స్ ఉపగ్రహాల సమూహాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ఇది కక్ష్యలో ఉన్న వస్తువులను నిలిపివేయవచ్చు లేదా పాడు చేసే శక్తి దీనికి ఉంది. దీంతో అగ్రదేశాల మధ్య పోటీ పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఈ ప్రయోగం చేసేందుకు రెడీ అవుతుంది. అయితే సైలెంట్ బార్కర్ గా పిలువబడే ఈ నెట్‌వర్క్ భూ-ఆధారిత సెన్సార్లు తక్కువ ఎత్తులో భూమికి దగ్గరగా కక్ష్యలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఉపగ్రహాలు భూమికి దాదాపు 22,000 మైళ్లు (35,400 కిలోమీటర్లు) పైకి పంపించనున్నారు. అదే వేగంతో అది కక్షలో తిరుగనుంది. దీనిని జియోసింక్రోనస్ ఆర్బిట్ అని అంటారు.

Read Also: JEE Exam: జేఈఈ స్మార్ట్ కాపీయింగ్ కేసు.. సంస్థ నిర్లక్ష్యంపై పోలీసులు సీరియస్‌

యూఎస్ వ్యవస్థలకు వ్యతిరేకంగా పని చేస్తున్న వాటిని గుర్తించి హెచ్చరికలను జారీ చేస్తుంది. అమెరికాకు ప్రమాదం పొంచి ఉంటే సకాలంలో ముప్పును గుర్తించడంతో పాటు దాన్ని ట్రాక్ చేయడం వంటి సామర్థ్యాన్ని ఈ ఆర్బిటర్ కలిగి ఉంది అని స్పేస్ ఫోర్స్ విశ్లేషకులు తెలిపారు. సైలెంట్ బార్కర్ అనేది కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ఇతర ఉపగ్రహాలు ఏం చేస్తున్నాయి అనే విషయాలపై పరిశీలన చేయనుంది. అమెరికా వ్యవస్థలను నాశనం చేసేందుకు చైనా-రష్యా చేస్తున్న ప్రయత్నాలకు ప్రతిస్పందనగా యూఎస్ కంట్రీ దీన్ని ఉపయోగిస్తుంది.

Read Also: Arvind Kejriwal: ఎస్పీ అధినేత అఖిలేశ్‌తో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ భేటీ

దీంతో చైనా-రష్యా దేశాలపై అమెరికా కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టింది. చైనా-రష్యా దేశాలకు చెందిన ఉపగ్రహాలను ట్రాక్ చేసేందుకు దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇక అమెరికా శాస్త్రవేత్తలు అంతరిక్ష దళ సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. ఇక ఇదే అంశంపై అంతరిక్ష కార్యక్రమాలను పర్యవేక్షించే హౌస్ ఆర్మ్‌డ్ సర్వీసెస్ కమిటీ సారా మినీరో స్పందించారు.

Read Also: Naga chaitanya : ఆ సూపర్ హిట్ సినిమా ను రీ మేక్ చేయబోతున్న నాగ చైతన్య..!!

చైనా ప్రయోగించిన ఉపగ్రహం లాంటిది మా ఉపగ్రహాల చుట్టూ లేదా వాటి సమీపానికి వచ్చి విన్యాసాలు చేస్తుంది.. దీంతో సైలెంట్ బార్కర్ కక్ష్యలో ప్రవేశపెట్టడంతో అంతరిక్షంలో అక్కడ ఏమి జరుగుతుందో నిజంగా గుర్తించడానికి పనికొస్తుందని ఆమె తెలిపారు. ఈ సంవత్సరం వార్షిక ముప్పు అంచనాలో, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ కార్యాలయం.. యూఎస్ అనుబంధ ఉపగ్రహాలను లక్ష్యంగా చైనా ఆయుధాలను సిద్ధం చేసుకుందని.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సూచించింది.

Read Also: Venu : బలగం సక్సెస్ ను అక్కడ ఎంజాయ్ చేస్తున్న వేణు..!!

2021లో చైనా యొక్క SJ-21 ఉపగ్రహాన్ని ప్రయోగించింది.. తరువాత పనికిరాని చైనీస్ ఉపగ్రహాన్ని అనేక వందల మైళ్ల దూరం.. ఎత్తైన కక్ష్యలోకి తీసుకెళ్లింది. 2022 డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నివేదిక ప్రకారం, మరో చైనీస్ ఉపగ్రహం, సిజియాన్-17, రోబోటిక్ చేయితో ఇతర ఉపగ్రహాలను పట్టుకోవడానికి ప్రయత్నం చేసినట్లు వెల్లడైంది. అయితే SJ-21 ఉపగ్రహం ఒక కౌంటర్‌స్పేస్ పాత్రలో పనిచేస్తుందని.. అది అమెరికా జియోసింక్రోనస్ ఉపగ్రహాలను ప్రమాదంలో పడేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు యూఎస్ స్పేస్ కమాండ్ అధిపతి జనరల్ జేమ్స్ డికిన్సన్ తెలిపాడు. సైలెంట్ బార్కర్ అనేది కొత్త వస్తువులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు SJ-21 శాటిలైట్ ను ట్రాక్ చేయబడింది అని జనరల్ జేమ్స్ డికిన్సన్ చెప్పారు.