Retirement Age : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రిటైర్ మెంట్ ఏజ్ రెండేళ్లు పెరిగింది.. వారికి మాత్రమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Retirement Age : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కేంద్రపాలిత ప్రాంత(UT) అడ్మినిస్ట్రేటర్ బన్వరీలాల్ పురోహిత్ చండీగఢ్‌లో వర్తించే సెంట్రల్ సర్వీస్ రూల్స్‌ను నోటీఫై చేశారు. ఈ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు రెండేళ్లు పెరిగింది. ఇంతకు ముందు అది 58ఏళ్లు ఉండగా ప్రస్తుత మార్పుతో 60 సంవత్సరాలు అవుతుంది. ఉపాధ్యాయులు నెలకు సుమారు రూ. 4000 వరకు ప్రయాణ భత్యం పొందుతారు. అంతే కాకుండా సీనియారిటీ ఉన్న ఉపాధ్యాయులను పాఠశాలలకు ఇప్పుడు డిప్యూటీ ప్రిన్సిపాల్ గా నియమిస్తారు. మహిళా ఉద్యోగులకు శిశు సంరక్షణ కోసం రెండేళ్లు సెలవు ఉంటుంది. 12వ తరగతి వరకు ఇద్దరు పిల్లల తల్లిదండ్రులకు విద్యా భత్యం లభిస్తుంది.
Read Also:T 20 Blast: తుఫాన్ వేగంతో శతక్కొట్టిన డొమెస్టిక్ వికెట్ కీపర్
Also Read
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ఈ నోటిఫికేషన్ UT ఉద్యోగుల పే స్కేల్, సర్వీస్ షరతులను కూడా మారుస్తుంది. సెంట్రల్ సర్వీస్ రూల్స్ ఆమోదించడంతో పదవీ విరమణ వయస్సు కూడా 2022 నుండి 58 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు పెరిగింది. సెంట్రల్ సర్వీస్ రూల్స్ అమల్లోకి రావడంతో ఉద్యోగుల వేతన స్కేలు ప్రస్తుతం పంజాబ్ ప్రభుత్వ ఉద్యోగులలోని ఆయా కేటగిరీలకు అనుగుణంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. ఇప్పుడు ఇవి రాష్ట్రపతి సెంట్రల్ సివిల్ సర్వీసెస్‌లోని సంబంధిత సేవలకు సమానంగా ఉంటాయి. చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంత వ్యవహారాల్లో పనిచేస్తున్న ఆల్ ఇండియా సర్వీసెస్ సభ్యులు, పంజాబ్, హర్యానా హైకోర్టు ఉద్యోగులు, UT చండీగఢ్‌లో పూర్తి సమయం ఉద్యోగం చేయని వ్యక్తులు, ఆకస్మిక పరిస్థితుల నుండి చెల్లించే వ్యక్తులకు ఈ నియమాలు వర్తించవు. పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం ఏర్పడిన 14 రోజుల తర్వాత, చండీగఢ్‌లో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ సర్వీస్ రూల్‌ను అమలు చేస్తున్నట్లు హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. పంజాబ్‌లో దీన్ని తీవ్రంగా వ్యతిరేకించినా.. లోక్‌సభలో పంజాబ్‌కు చెందిన పలువురు ఎంపీలు నోటిఫికేషన్ జారీ చేయవద్దని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?