NTV Telugu Site icon

Minister Narayana: భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి త్వరలోనే కొత్త విధానం

Minister Narayana

Minister Narayana

Minister Narayana: నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి కొత్త విధానాన్ని త్వరలోనే తీసుకువస్తున్నామని మంత్రి వెల్లడించారు. డిసెంబర్ 15 నాటికి ఈ విధానం అమలులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే అసెంబ్లీలో బిల్లు పెడతామని చెప్పారు. 20 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన తర్వాతనే కొత్త విధానాలను రూపొందించామన్నారు.

Read Also: AP Assembly Sessions 2024: రేపు ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు

నగరపాలక సంస్థలు మునిసిపాలిటీలు… నగర పంచాయతీల అభివృద్ధి కోసం ప్రజలు తాము చెల్లించాల్సిన పన్నులను సత్వరమే కట్టాలని కోరారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌ను కూడా నిర్వహిస్తామన్నారు. అభివృద్ధికి ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలన్నారు. వాణిజ్య సంస్థలు భారీగా బకాయిలను చెల్లించాల్సి ఉందన్నారు. మునిసిపల్ శాఖ మంత్రిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. అందరూ సహకరించి పన్నులను చెల్లించాలని మంత్రి నారాయణ విజ్ఞప్తి చేశారు.

Show comments