Kalvakuntla Kavitha : ఈడీ తాజా చార్జ్ షీట్ లో కీలక అంశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ తాజా చార్జ్ షీట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ కేసులో కవిత పై అభియోగాలు నమోదు చేసింది ఈడీ. మే 10న కవిత పై చార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ.. 8364 పేజీలతో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సాక్షులను ప్రభావితం చేయడంలో కవిత పాత్ర ఉందని, బుచ్చిబాబు కవిత పాత్ర పై వాంగ్మూలమిచ్చారు ఆ తర్వాత కవితకు వ్యతిరేకంగా ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కు తీసుకోవాలని కవిత బుచ్చిబాబుపై ఒత్తిడి చేసిందని ఈడీ పేర్కొంది. అరుణ్ రామ్ చంద్ర పిళ్లయి ఇచ్చిన స్టేట్మెంట్లను కవిత ఒత్తిడి మేరకే వెనక్కి తీసుకునేందుకు రిట్రాక్ట్ పిటిషన్ వేశారని ఈడీ తెలిపింది. అయితే.. తాజా చార్జి షీట్ ను పరిగణనలోకి తీసుకుంది స్పెషల్ కోర్ట్.. లిక్కర్ స్కాం లో 1100 కోట్ల నేరం జరిగిందని చార్జ్ షీట్ లో పేర్కొన్న ఈడీ.. 192 కోట్ల లాభాలను ఇండో స్పిరిట్స్ పొందిందని, 100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారని తెలిపింది. కవిత డిజిటల్ ఆధారాలు ధ్వంసం చేసిందని, 292 కోట్ల నేరం లో కవిత పాత్ర ఉందని ఈడీ వెల్లడించింది.
లిక్కర్ కేసులో ఇప్పటివరకు 18 మందిని అరెస్ట్ చేసిన ఈడీ.. ఇప్పటివరకు లిక్కర్ కేసు విచారణలో 49 మందిని ఇంటరాగేషన్ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనకు ముందు వెనక పలుసార్లు విజయనగరతో కవిత సమావేశం అయ్యారని, సౌత్ గ్రూపు వచ్చిన 100 కోట్ల రూపాయల ముడుపులను గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖర్చు చేసిందని ఈడీ తెలిపింది. ఇండో స్వీట్స్ కంపెనీలో సౌత్ గ్రూప్ 65% వాటా అని, కవిత పాత్ర పై ఇప్పటికే అరెస్టు అయిన నిందితుల వాంగ్మూలాలను చార్జ్ షీట్లో ఈడీ వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ వ్యాపారం సంబంధించి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మనీశ్ సిసోడియా లతో కవిత సంభాషణలు జరిపిందని, లిక్కర్ వ్యాపారంలో విజయ్ నాయర్ సౌత్ గ్రూప్ కు కోఆర్డినేటర్ గా వ్యవహరించాడని, ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ఆధారాలను ధ్వంసం చేసింది అంటూ ప్రత్యేకంగా పేర్కొంది ఈడీ. విచారణ సందర్భంగా కవిత తప్పుడు సమాచారం ఇచ్చారని, 9 ఫోన్ లను ఈడీకి కవిత ఇచ్చారు ఈ క్రమంలో పొలిటికల్ షో చేసిందని ఈడీ తెలిపింది.
Also Read
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
- Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
- ENG vs SL: హడలెత్తించిన 'హ్యారీ బ్రూక్' సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
ఈడి చార్జిషీట్ లో కవిత స్టేట్మెంట్ : ‘లిక్కర్ పాలసీ రూపకల్పనలో నా తరపున పాల్గొనాలని బుచ్చిబాబు కి నేను ఎలాంటి అథరైజేషన్ ఇవ్వలేదు. ఇండో స్పిరిట్ లో ప్రత్యక్షంగా, పరోక్షంగా నాకు ఎలాంటి వాటా లేదు. ఢిల్లీ లిక్కర్ వ్యాపారం గురించి నేను ఎవరితో మాట్లాడలేదు. బుచ్చిబాబు, రాఘవ ల మధ్య జరిగిన సంభాషణలు చూపిస్తే నాకు గుర్తులేదు, వాళ్ళ నెంబర్లు కూడా తెల్వదు. లిక్కర్ పాలసీ రూపకల్పన, లిక్కర్ వ్యాపారం నాకు సంబంధం లేదు, నా తరపున ఎవరు ఆప్ సంప్రదించలేదు, లంచాలు ఇవ్వలేదు. అరుణ్ పిళ్ళై నా ఫామిలీ ఫ్రెండ్, వికేండ్లలో తరచు కలుస్తుంటాం, బతుకమ్మ లాంటి కలిసి నిర్వహించాం. అరుణ్ పిళ్ళై ఇచ్చిన స్టేట్మెంట్ లను కవిత నిరాకరించింది. అరుణ్ పిళ్ళై సమీర్ మహేంద్రును హైదరాబాద్ లో కవిత కు పరిచయం చేశాడు. కవిత సమీర్ మహేంద్రు తో మాట్లాడిన విషయం గుర్తు లేదన్న కవిత. ఇండో స్పిరిట్ లో అరుణ్ పిళ్ళై నా తరపున కార్యకలాపాలు నిర్వహించలేదు. ఇండియా హెడ్ న్యూస్ ఛానల్ లో అభిషేక్ కు వాటాలు ఉన్న సంగతి నాకు తెలియదు. ఇండియా హెడ్ ఛానల్ లో పెట్టుబడులు పెట్టాలని గౌతమ్ ముత్త నన్ను కోరినా ఇంట్రస్ట్ లేదని చెప్పాను. మాగుంట శ్రీనివాస్ రెడ్డి అనేక సందర్భాలలో కలిశాను, కానీమాగుంట రఘువరెడ్డిని ఒక్కసారి మాత్రమే కలిశాను.’
తాజావార్తలు
-
Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
-
Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
-
Tollywood : సెన్సార్ లేట్.. ఈ వారం సినిమాలు వాయిదా?
-
ChiranjeeviOdela : ‘ప్యారడైజ్’ రిజల్ట్‌పైనే చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ ఆధారపడి ఉందా?
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!