Site icon NTV Telugu

Central Govt: IPC, CrPc స్థానంలో కొత్త చట్టాలు.. వచ్చే వారం సభ ముందుకు కొత్త బిల్లులు..!

Ipc, Crpc

Ipc, Crpc

ఇండియన్ పీనల్ కోడ్ (IPC), ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సాక్ష్యాధారాల చట్టంలో మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు కొత్త బిల్లులను ఆమోదించింది. వచ్చే వారం పార్లమెంట్‌లో మూడు కొత్త బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. ఆగస్టు 11న హోంమంత్రి అమిత్ షా.. 163 ఏళ్ల నాటి మూడు ప్రాథమిక చట్టాలను సవరించే బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులు ఇండియన్ పీనల్ కోడ్ (IPC), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (CrPC), ఎవిడెన్స్ యాక్ట్. కొత్త రూపంలో తీసుకురానున్న దేశద్రోహ చట్టానికి సంబంధించి అతిపెద్ద మార్పు. కొత్త బిల్లులను పార్లమెంటు ఆమోదించిన తర్వాత.. అనేక సెక్షన్లు, నిబంధనలు మారనున్నాయి.

Read Also: CM Revanth Reddy: ఉద్యోగ నియామకాలపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ..

IPC అంటే ఏమిటి?
సివిల్ లా, క్రిమినల్ IPC (ఇండియన్ పీనల్ కోడ్) పరిధిలోకి వస్తాయి. తీవ్రమైన నేరాలకు పాల్పడితే ఐపీసీ సెక్షన్లు విధిస్తారు. IPC భారతీయ పౌరుల నేరాలను వారికి నిర్దేశించిన శిక్షతో పాటు నిర్వచిస్తుంది. IPCలో 23 అధ్యాయాలు, 511 విభాగాలు ఉన్నాయి. కాగా.. IPC సెక్షన్లు భారత సైన్యానికి వర్తించవు.

CrPC అంటే ఏమిటి?
సాధారణంగా.. IPC సెక్షన్ల కింద పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేస్తారు. అయితే CrPC దర్యాప్తు ప్రక్రియలో ఉపయోగించుతారు. CrPC పూర్తి పేరు.. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. సాధారణంగా.. పోలీసులు IPC కింద క్రిమినల్ కేసులను నమోదు చేస్తారు. ఆ తర్వాత ప్రక్రియ CrPC కింద సాగుతుంది.

Read Also: 8th Pay Commission: ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. న్యూయర్ కు జీతాలు పెరిగే అవకాశం..!

ఇదిలా ఉంటే.. ప్రభుత్వం తరపున 18 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలు, సుప్రీంకోర్టు, 22 హైకోర్టులు, న్యాయ సంస్థలు, 142 మంది ఎంపీలు, 270 మంది ఎమ్మెల్యేలు ఈ బిల్లులకు సంబంధించి ప్రజలు కూడా సలహాలు ఇచ్చారు. నాలుగు సంవత్సరాల సమయం తర్వాత, 158 సమావేశాల తరువాత.. ప్రభుత్వం ఆగస్టులో బిల్లును ప్రవేశపెట్టింది.

Exit mobile version