జేఎన్టీయూ కొత్త ఇంఛార్జ్ వైస్ ఛాన్సలర్గా నియమితులైన బుర్రా వెంకటేశం నేడు జేఎన్టీయూని సందర్శించారు. వైస్ ఛాన్సలర్ ఛాంబర్ లో డైరెక్టర్ కె. విజయకుమార్ రెడ్డి, రిజిస్టార్ కె. వేంకటేశ్వరావుల సమక్షంలో యూనివర్సిటీలోని డైరెక్టర్లను, కాలేజ్ ప్రిన్సిపాల్, క్యాంపస్ కాలేజీలోని పలు డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న ఆచార్య వర్గాన్ని, ఆయా డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలు, ఇంచార్జ్ వైస్ ఛాన్స్లర్కు రిజిస్టార్ పరిచయం చేశారు.
Read Also: French Airlines: సిబ్బంది మెరుపు సమ్మె.. 70 శాతం విమాన సర్వీసులు రద్దు
అనంతరం ఇంఛార్జ్ వైస్ ఛాన్సలర్ బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. విద్యార్థుల అవసరాన్ని గుర్తించి మంచి విద్యా భోధన చేయాలని తెలిపారు. మీరు ఉపాధ్యాయులకు సంతృప్తిని ఇచ్చే విధంగా.. చదువు నేర్పిన విద్యార్థులు ఉన్నత స్థితిలో ఉంటే ఆ ఉపాధ్యాయులు సంతోషం వేరు అని అన్నారు. వచ్చే వారము తాను ప్రతి డిపార్ట్మెంట్ ను సందర్శిస్తానని చెప్పారు. దేశంలో పేరు గల యూనివర్సిటీ జేఎన్టీయూ.. ఆ పేరు ప్రతిష్టలు కాపాడుకుంటూ మరింత మెరుగైన సేవలు మనం విద్యార్థులుకు అందించాలని కోరారు. మీకు ఎలాంటి సమస్య ఉన్న డైరెక్ట్గా సమస్యను తన దృష్టికి తీసుకొని రండి.. తాను ఆలస్యం చేయకుండా న్యాయం మీకు జరగాల్సిన మేలు తప్పకుండా చేస్తానని బుర్రా వెంకటేశం తెలిపారు.
Read Also: Bhaskar Reddy: నాని హైడ్రామా చేశారు.. తిరుపతి దాడి ఘటనపై భాస్కర్ రెడ్డి వీడియో ప్రజంటేషన్