NTV Telugu Site icon

Air India: గన్నవరం నుంచి ముంబైకి నూతన విమాన సర్వీస్ ప్రారంభం

Air India

Air India

Air India: ఇకపై విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబయికి డైరెక్ట్‌ విమాన సర్వీస్‌లు నడవనున్నాయి. గన్నవరం నుండి ముంబైకి విమాన సర్వీసును ఎంపీలు బాలశౌరి, ఎంపీలు కేశినేని చిన్ని ప్రారంభించారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లు గన్నవరం నుంచి ప్రారంభం అయ్యాయని ఎంపీ బాలశౌరి వెల్లడించారు. కొత్త ప్రభుత్వంలో వేగంగా ఏపీ అభివృద్ది చెందుతుందన్నారు. రాజధానికి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కావాలని.. ఇతర ప్రాంతాలకు కూడా ఎయిర్ లైన్ సర్వీసులు కావాలని ఆయన పేర్కొన్నారు. రాజధానికి కావాల్సిన అన్ని సర్వీసులు త్వరలోనే ప్రారంభం అవుతాయన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు రావటానికి కృషి చేస్తామన్నారు. ముంబై ఫ్లైట్ కనెక్టివిటీ ఫ్లైట్ ఇది ప్రయాణికులకు సులువుగా ఉంటుందన్నారు. గతంలో వీటిపై చాలా రిక్వెస్ట్‌లు పెట్టామని పేర్కొన్నారు. ఎయిర్ ఇండియాకు ఎంపీ బాలశౌరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని ప్రాంతం కావటంతో ఫ్లోటింగ్ కూడా ఉంటుందన్నారు. ఢిల్లీ ఫ్లైట్‌లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి.. దీనిపై ఇండిగో వారితో మాట్లాడుతున్నామన్నారు. కొత్త టెర్మినల్ బిల్డింగ్ త్వరగా పూర్తి చేస్తామన్నారు.

Read Also: Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కు లక్షల ఖరీదు చేసే పెన్.. వదినమ్మ స్పెషల్ గిఫ్ట్

వ్యాపార వర్గాలకు ముంబై సర్వీస్ ఉపయోగపడుతుందని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. అద్భుతమైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయ్యేలా కృషి చేస్తామన్నారు.ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఫ్లైట్స్ త్వరలో అందుబాటులో ఉంటాయన్నారు. మొదటి రోజే ముంబై బుకింగ్స్ ఫుల్ అయ్యాయని ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు. మ‌చిలీప‌ట్నం ఎంపీ బాల‌శౌరీ చొర‌వ వల్లే ఎయిరిండియా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఆయ‌న ఎయిర్‌పోర్టు అథారిటీ ఛైర్మన్‌గా ఉన్న స‌మ‌యంలో ముంబయి, విజ‌య‌వాడ మ‌ధ్య విమాన స‌ర్వీస్ ప్రారంభించాల్సిందిగా సంబంధిత శాఖ మంత్రులు, అధికారుల‌కు విజ్ఞప్తి చేశారు.

ఇకపై సీఐఎస్‌ఎఫ్ భద్రత

గన్నవరం ఎయిర్ పోర్టులో ఇకపై సీఐఎస్‌ఎఫ్ భద్రత అందుబాటులోకి రానుంది. జులై 2 నుంచి అమల్లోకి రానున్నట్టు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇప్పటి వరకు ఎస్పీఎఫ్, స్పెషల్ పోలీస్ ద్వారా గన్నవరం ఎయిర్ పోర్ట్ లో భద్రత సేవలు అందనున్నాయి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) ద్వారా భద్రత కల్పిస్తున్నట్లు డీజీపీకి లేఖ ద్వారా ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ తెలిపారు.