Megastar Chiranjeevi Wife Surekha gifts Mount Blak Movie to Pawan Kalyan: జనసేన-బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. మిత్ర పక్షాలకు మంత్రి పదవులు కేటాయించడంతో పాటు.. కీలక మంత్రిత్వ శాఖలు కేటాయించారు.. డిప్యూటీ సీఎం హెూదాను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఒక్కరికే పరిమితం చేశారు. కేబినెట్‌లోకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రావడంతో ఆయన ఒక్కరికే డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చి గౌరవించారు చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖల మంత్రిగా ఉన్నారు. ఇక ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి భార్య పవన్ కళ్యాణ్ వదినమ్మ సురేఖ పవన్ కళ్యాణ్ కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు.
Swetha Menon: ‘రతినిర్వేదం’ హీరోయిన్ అప్పటికన్నా ఇప్పుడే బావుందే.. లేటెస్ట్ పిక్స్ చూశారా?
లగ్జరీ పెన్ బ్రాండ్ మౌంట్ బ్లాక్ నుంచి పవన్ కళ్యాణ్ కి ఒక మంచి పెన్ గిఫ్ట్ ఇచ్చారు. దాని ఖరీదు దాదాపు మూడున్నర
లక్షల రూపాయలుగా ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. నిజానికి మౌంట్ బ్లాక్ పెన్నులు 10వేల నుంచి మొదలవుతాయి లక్షల ధరల్లో కూడా దొరుకుతాయి. అయితే పవన్ కళ్యాణ్ కి సురేఖ ఏ పెన్ ఇచ్చారనే విషయం మీద క్లారిటీ లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం మూడున్నర లక్షల రూపాయల ఖరీదైన పెన్ ఇచ్చారు అనే ప్రచారం మొదలైంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ గిఫ్ట్ ఇస్తున్న సమయంలో వీడియోని షూట్ చేయగా దాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక తెలుగు ప్రజలకు సేవ చేస్తామని ఆశిస్తున్నామని మెగాస్టార్ చిరంజీవి వీడియోలో పేర్కొన్నారు.
కళ్యాణ్ బాబుకు వదినమ్మ బహుమతి! 😍@PawanKalyan pic.twitter.com/vzt6rNX7gt
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 15, 2024