ఢిల్లీలోని 70 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. నేడు తుది ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో అందరి కళ్లు వీఐపీ సీట్లపైనే ఉన్నాయి. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో కౌంటింగ్ హోరాహోరీగా కొనసాగుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ స్థానం అత్యంత ముఖ్యమైన స్థానం. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ మధ్య గట్టి పోటీ నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ నుంచి సందీప్ దీక్షిత్ బరిలోకి దిగారు. ఆయన ప్రభావం ఏం కనిపించడం లేదు.
READ MORE: War2 : ఆమెతో ‘వార్ 2’ లో సాలీడ్ ఐటెం సాంగ్స్ ప్లాన్ చేస్తున్న మూవీ టీం..
ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం.. న్యూఢిల్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 6 రౌండ్ల లెక్కింపు తర్వాత, ప్రవీణ్ 225 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కేజ్రీవాల్ రెండో స్థానానికి పరిమితమయ్యారు. ఈ పరిణామాలు ఆప్‌ను నిరాశ పరుస్తున్నాయి. కేజ్రీవాల్ ఇంట్లో నిశ్శబ్దం ఆవరించింది. రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ తప్ప, మరే ఇతర నాయకుడు లేదా కార్యకర్త ఇప్పటివరకు కేజ్రీవాల్ ఇంటికి చేరుకోలేదు.
READ MORE: Priyanka Gandhi: ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ప్రియాంక గాంధీ.. ఎమన్నారంటే?
న్యూఢిల్లీ సీటు ఢిల్లీ అసెంబ్లీలో అత్యంత హాటెస్ట్ సీటు. ఈ స్థానం ఢిల్లీకి ముఖ్యమంత్రులను ఇస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ కు ముందు, ఈ స్థానాన్ని షీలా దీక్షిత్ ఆక్రమించారు. ఆమె 2013 వరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ 2013 నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ సారి గెలుస్తారా? లేదా? అనేది మరి కొన్ని గంటల్లో తేలనుంది.