Infant Kidnap: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పసికందు కిడ్నాప్ కలకలం రేపింది. ఆదివారం అర్ధరాత్రి గోరంట్లకు చెందిన షేక్ నసీమా అనే మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ రోజు మధ్యాహ్నం గుర్తు తెలియని ఓ మహిళ జీజీహెచ్‌కు చేరుకుని.. బిడ్డ బాగున్నాడు అంటూ చేతిలోకి తీసుకొని అక్కడి నుంచి పరారైంది. ఒక్కసారిగా జరిగిన పరిణామంతో కంగుతిని హాస్పిటల్ అధికారులకు బిడ్డ తల్లి ఫిర్యాదు చేసింది. జీజీహెచ్‌లో శిశువు మాయం ఘటన విషయం తెలుసుకొని పోలీసులు రంగంలో దిగారు. శిశువును ఎత్తుకెళ్లిన మహిళ కోసం గాలిస్తున్నారు.
Read Also: Indrakeeladri Temple: బెజవాడ దుర్గమ్మకు శ్రీకాళహస్తి నుంచి పట్టువస్త్రాలు
పసికందు అదృశ్యంపై శిశువు బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఈ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో నలుగురు సభ్యుల ముఠా, గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లోకి ప్రవేశించిందని తెలిసింది. అందులో ఓ మహిళ బాలింతరాలి వేషం వేసుకొని శిశువును అపహరించింది. ఆ వెంటనే దగ్గరలో ఆటోలో మాటు వేసి ఉన్న తమ బృందం వద్దకు వెళ్లింది. ఆటోతో సహా ప్రభుత్వ హాస్పిటల్ నుంచి పారిపోయింది. ప్రస్తుతం శిశువును జాడ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.