NTV Telugu Site icon

Vijayawada: బెజవాడలో అమానుషం.. అప్పుడే పుట్టిన పాపను చెత్త కుప్పలో వదిలేసిన తల్లి

Child

Child

Vijayawada: ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో ఏమో తెలియదు గాని అప్పుడే పుట్టిన బిడ్డను చెత్తకుప్పల్లో పడేసి వెళ్ళిపోయింది. కనీస మానవత్వంతో ఆలోచించని ఆ తల్లి ప్రేగు తెంచుకొని పుట్టిన బిడ్డను చెత్తలో పడేసింది. మరో విధంగా ఆలోచిస్తే అమ్మ జాతికి మాయని మచ్చ తెచ్చే ఘటన విజయవాడలో వెలుగులోకి వచ్చింది. బెజవాడలో అప్పుడే పుట్టిన పాపను చెత్త కుప్పలో పడేసిన ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. బెజవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో ఈ ఘటన జరిగింది. సాయిబాబా గుడి సమీపంలో ఉన్న చెత్తలో అప్పుడే పుట్టిన పాపను వదిలేసి వెళ్లిపోయింది ఓ కసాయి తల్లి. తెల్లవారుజామున ఏడుపులు విడిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని చుట్టుపక్కల వారిని ఆరా తీశారు. ఏ వివరాలు తెలియకపోవడంతో పాపను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Read Also: High Tension: నారాయణ కాలేజీ వద్ద పోలీసుల మోహరింపు..

Show comments