NTV Telugu Site icon

IND vs PAK: అతడిని తుది జట్టులో ఎందుకు తీసుకున్నారు.. యావరేజ్ ప్లేయర్!

India Team Young

India Team Young

Netizens Asks, Why Shardul Thakur picked over R Ashwin: శనివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌కు శ్రేయాస్ అయ్యర్ క్లాస్ తోడవ్వడంతో టీమిండియా సునాయాస విజయాన్ని అందుకుంది. అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించిన భారత్.. పాక్‌ను ఏ దశలో కోలుకోనివ్వలేదు. అయితే ఈ మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ విఫలమయ్యాడు.

ఈ మ్యాచ్‌లో వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆడతాడని అంతా అనుకున్నారు. సునీల్ గవాస్కర్ లాంటి సీనియర్లు కూడా అశ్విన్‌నే జట్టులోకి తీసుకోవాలని సూచనలు చేశారు. అయితే టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం స్పిన్నర్ కంటే.. ఆల్‌రౌండర్ జట్టులో ఉండాలని భావించింది. దాంతో అశ్విన్‌ను పక్కన పెట్టి శార్దూల్‌ ఠాకూర్‌ని తుది జట్టులోకి తీసుకుంది. మ్యాచ్‌లో మిగతా భారత బౌలర్లు అందరూ రెండేసి వికెట్స్ పడగొట్టి తక్కువ రన్స్ ఇస్తే.. శార్దూల్‌ మాత్రం భారీగా పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు.

Also Read: IND vs PAK: విరాట్ కోహ్లీని బాబర్‌ ఆజామ్ జెర్సీ అడగకుండా ఉండాల్సింది.. పాక్‌ లెజెండ్‌ సంచలన వ్యాఖ్యలు!

మ్యాచ్‌లో రెండు ఓవర్లు మాత్రమే వేసిన శార్దూల్‌ ఠాకూర్‌.. 12 పరుగులిచ్చి ఫెయిల్ అయ్యాడు. ఇక బ్యాటింగ్‌‌లో అతడికి క్రీజులోకి వచ్చే అవకాశమే రాలేదు. దాంతో నెటిజన్స్ ఠాకూర్‌ని ట్రోల్ చేస్తూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు. ‘శార్దూల్ మ్యాచ్ ఆడాడనికి వచ్చాడా?.. లేదంటే చూడడానికి వచ్చాడా?. అక్షర్ పటేల్ ఉంటే బాగుండేది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘శార్దూల్ జట్టులో ఎందుకు?.. యావరేజ్ ప్లేయర్’ అని ఇంకో నెటిజన్ ట్వీట్ చేశాడు. ఠాకూర్‌ని ట్రోల్ చేస్తూ చాలామంది నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Show comments