Viral Video: సాగదీస్తూ ఇంగ్లీష్ మాట్లాడిన యువతి. ఆడేసుకుంటున్న నెటిజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పై చదువుల కోసం చాలా మంది యువత నేటి కాలంలో దేశం విడిచి విదేశాలకు వెళుతున్నారు. అక్కడే ఎంతో మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందుతున్నారు. అయితే అక్కడికి వెళ్లిన వారిలో కొంతమంది స్వదేశానికి తిరిగి వస్తుండగా మరికొంత మంది అక్కడే సెటిల్ అయిపోతున్నారు. అయితే దేశంలో ఉన్నప్పుడు కాకరకాయ అని, ఫారెన్ వెళ్లి వచ్చాక కీకరకాయ అన్నాడు అనే సామెత మనం తరచూ వింటూ ఉంటాం. సేమ్ అలానే ప్రవర్తించి ఓ భారతీయ యువతి. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంగ్లీష్ సాగదీస్తూ మాట్లాడటానికి ప్రయత్నిస్తున్న ఆ యువతిని నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు.
Also Read
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
- US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
వీడియో ప్రకారం కెనడాలో ఉంటున్న భారతీయ యువతిని ఓ యూట్యూబర్ ఇంటర్వ్యూ చేశాడు. కెనడాలో ఎప్పటి నుంచి ఉంటున్నారు? కెనడా ఎందుకు వచ్చారు? ఇక్కడి జీవితం ఎలా ఉంది? మాతృదేశానికి విడిచి దూరంగా ఉంటున్నందుకు బాధపడుతున్నారా? లాంటి చాలా ప్రశ్నలు అడిగాడు. వాటన్నింటికి ఆ యువతి చకచక సమాధానాలు చెప్పింది. తాను మూడేళ్లుగా కెనడాలో ఉంటున్నట్టు చెప్పుకొచ్చింది ఆ యువతి. తాను ఇండిపెండెంట్ గా ఉండాలనుకునే యువతినని ఆమె తెలిపింది. ఇక తాను మొదట్లో ఒట్టోవాలో ఉండేదాన్నని, ఆ తరువాత టొరొంటోకు మారిపోయానని తెలిపింది. ఇక ఒట్టోవా కంటే టొరొంటోనే తనకు మంచిగా అనిపిస్తోందని తెలిపింది. ఇక ఇండియాను మిస్ అవుతున్నారా అనే ప్రశ్నకు ఎటువంటి మోహమాటం లేకుండా తల్లిదండ్రులకు దూరంగా ఉండటం మినహా తాను భారత్‌ను ఏమాత్రం మిస్సవట్లేదని ఆ యువతి సమాధానం ఇచ్చింది. ఇక ఈ సమాధానం పై నెటిజన్లు భగ్గుమంటున్నారు. విదేశాల్లో సెటిలైన కొందరు భారతీయులకు ఇండియాను చులకన చేసి మాట్లాడటం అలవాటు అయ్యిందని మండిపడుతున్నారు. విదేశాలకు వెళ్లినంత మాత్రాన ఇలా మారిపోవాలా అంటూ ఫైర్ అవుతున్నారు. ఇక ఆ యువతి మాట్లాడిన ఇంగ్లీష్ తీరుపై కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పాశ్చాత్య యాసలో మాట్లాడేందుకు ఆమె ఎంత కష్టపడుతుందో ఆమెను చూస్తేనే అర్థం అవుతుందని అంత కష్టపడి మాట్లాడటం అవసరమా నీకెందుకు ఇన్ని తిప్పలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వైరల్ గా మారిన ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షల్లో వీక్షించారు. చూసిన వారిలో చాలా మంది ఆమె ఇండియా పై చేసిన కామెంట్లను తప్పుబడుతుండగా, మరికొందరు ఆమె ఇంగ్లీష్ మాట్లాడిన తీరును విమర్శిస్తున్నారు.
“I am from aaaaaatawaa, I want to be indiiiiipandant”
India bhale hi wapas na ho but aisi fake accent se daro didi. pic.twitter.com/fIAd25JMer
— PulseIndia (@_singhvishal23) August 17, 2023
తాజావార్తలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
-
Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!