పోలీస్ జాబ్ అంటే సవాళ్లతో కూడుకున్నది. నిత్యం కేసులు, కోర్టులు అంటూ విధుల్లో బిజీగా ఉండే పోలీసులు కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలా అందరి మనసు దోచుకుంటున్నారు కొందరు పోలీసులు. తాజాగా పంజాబ్ లో ఓ పోలీస్ ఆఫీసర్ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read Also : Chennakesava Reddy: చంద్రబాబు తర్వాత టీడీపీ మాయం..! ఎప్పటికైనా జూ.ఎన్టీఆరే టీడీపీ నాయకుడు..
పంజాబ్ పోలీస్ ఆఫీసర్ రాగ్ పికర్ రోడ్డు మీద వెళుతున్న ఓ బాలుడికి వాటర్ బాటిల్ అందించాడు. కాళ్లకు చెప్పులు కూడా లేని అతనికి స్వయంగా తొడిగించాడు. అలాగే సదరు బాలుడికి కొత్తబట్టలు కూడా ఇవ్వడంతో ఆ బాలుడి కళ్లు ఆనందంతో మెరిసిపోయాయి. వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ కి చేతులు జోడించాడు.
Read Also : Sai Dharam Tej: నేను ఎవరికీ డబ్బులు ఇవ్వలేదు, తప్పుడు ప్రచారం చెయ్యకండి
అయితే నిత్యం డ్యూటీలో బిజీగా ఉండే పోలీసులు కనీసం కుటుబ సభ్యులతో కూడా సమయం గడపడానికి సమయం దొరకదు. ఇక సేవా కార్యక్రమాలకు.. అనుకునే వారికి రాగ్ పికర్ ఆదర్శంగా నిలిస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసిన నెటిజన్స్ ఆయనపై అభినందనల జల్లు కురిపిస్తున్నారు. రాగ్ పికర్ సహాయం చేస్తున్న వీడియోను అభయ్ గిరి అనే ఇన్ స్టాగ్రామ్ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
Read Also : Thailand: థాయ్‌లాండ్‌లో దారుణం.. 12 మంది స్నేహితులకు సైనైడ్ ఇచ్చి హత్య చేసిన మహిళ
దీంతో రాగ్ పికర్ వీడియోను చూసిన నెటిజన్స్ సెల్యూట్ సార్ మీ లాంటి నిజాయితీ గత పోలీసులకు మాత్రమే.. అని కొందరు.. ప్రతి ఒక్కరూ మీలా ఉంటే దేశంలో 90 శాతం సమస్యలు తగ్గిపోతాయని మరికొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. రాగ్ పికర్ సేవాభావానికి అందరూ సలాం కొడుతున్నారు.