Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Netflix Cuts Subscription Rates In 116 Countries Following Success In India

Netflix: శుభవార్త చెప్పిన నెట్‌ఫ్లిక్స్‌.. ఛార్జీలు భారీగా తగ్గింపు.. !

Published Date :April 20, 2023 , 11:52 am
By Sudhakar Ravula
Netflix: శుభవార్త చెప్పిన నెట్‌ఫ్లిక్స్‌.. ఛార్జీలు భారీగా తగ్గింపు.. !
  • Follow Us :
  • google news
  • dailyhunt

Netflix: ఇప్పుడంతా ఓటీటీ ప్లాట్‌ఫాంల హవా కొనసాగుతోంది.. ప్రజల నుంచి మంచి ఆధరణ కూడా ఉండడంతో.. అవి చార్జీలను కూడా పెంచుతూ పోతున్నాయనే విమర్శలు ఉన్నాయి.. ఈ తరుణంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ చార్జీలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా 115 దేశాలలో సబ్‌స్క్రిప్షన్ చార్జీలను తగ్గిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్‌.. అంటే, గతంలో నెలకు నెట్‌ఫ్లిక్స్‌ రూ.199 వసూలు చేస్తూ వస్తుంది.. ఇది నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్-ఓన్లీ ప్లాన్ కాగా.. ఇప్పుడు అది రూ.149కే అందిస్తోంది.. మరోవైపు.. టీవీలు, కంప్యూటర్లు, మొబైల్స్‌ ఇలా ఎందులో అయినా యాక్సెస్ చేసుకోగలిగే బేస్‌ సబ్‌స్క్రిప్షన్ ధర గతంలో రూ.499గా ఉంటి దానిని భారీ తగ్గింపును ప్రకటించింది.. ఇప్పుడు రూ.199కే పరిమితం చేసింది..

నెట్‌ఫ్లిక్స్ 2021లో దేశంలో తక్కువ-ధర సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రారంభించిన తర్వాత కస్టమర్ ఎంగేజ్‌మెంట్‌లో 30 శాతం వృద్ధిని మరియు భారతదేశంలో సంవత్సరానికి 24 శాతం ఆదాయ వృద్ధిని సాధించింది. భారతదేశ మార్కెట్‌కు అనుగుణంగా మరియు దాని వ్యాప్తిని మరింతగా పెంచుకోవడానికి కంపెనీ మొదటిసారిగా సబ్‌స్క్రిప్షన్ ధరలను 20-60 శాతం పరిధిలో తగ్గించింది. అయితే 2022లో (ఫారెక్స్) తటస్థ ఆదాయ వృద్ధి 24 శాతానికి పెరిగింది.. ఈ విజయం నుండి నేర్చుకుని, మేము Q1లో అదనంగా 116 దేశాలలో ధరలను తగ్గించామని.. నెట్‌ఫ్లిక్స్ మార్చి 2023 త్రైమాసిక ఆదాయ నివేదికలో పేర్కొంది. తాజా పరిణామం దీర్ఘకాలికంగా మా ఆదాయాన్ని పెంచుకోవడానికి సహాయపడుతుందని నమ్ముతున్నట్టు ఆ సంస్థ పేర్కొంది.

Also Read

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
  • SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..

మార్చి 2023తో ముగిసిన త్రైమాసికంలో నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ నికర ఆదాయం 18 శాతం క్షీణించి 1,305 మిలియన్ల అమెరికన్‌ డాలర్లకు చేరుకుంది. ఇది ఒక సంవత్సరం క్రితం ఇదే కాలంలో 1,597 మిలియన్లు డాలర్లుగా ఉంది.. నెట్‌ఫ్లిక్స్ ఆదాయం, మార్చి 2022 త్రైమాసికంలో 7,868 మిలియన్స్‌ డాలర్ల నుండి నివేదించబడిన త్రైమాసికంలో 3.7 శాతం పెరిగి 8,162 మిలియన్‌ డాలర్లకు చేరుకుంది. కంపెనీ చెల్లింపు సభ్యత్వం ప్రపంచవ్యాప్తంగా 4.9 శాతం పెరిగి 232.5 మిలియన్లకు చేరుకుంది. నెట్‌ఫ్లిక్స్ ఏప్రిల్-జూన్ 2023 త్రైమాసికంలో దాని నికర ఆదాయం 1.6 శాతం తగ్గి 1,283 మిలియన్‌ డాలర్లకు తగ్గుతుందని అంచనా వేస్తుంది. అయితే, ఆదాయం 3.4 శాతం పెరిగి 8,242 మిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని చెబుతున్నారు.. కాగా, నెట్‌ఫ్లిక్స్ 2021లో భారతదేశంలో తక్కువ-ధర సబ్‌స్క్రిప్షన్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఇక్కడ కస్టమర్ ఎంగేజ్‌మెంట్‌లో 30 శాతం పెరుగుదలను, వార్షిక ఆదాయంలో 24 శాతం పెరుగుదలను నమోదు చేసింది. భారతీయ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన నెట్‌ఫ్లిక్స్‌ మొదటిసారిగా సబ్‌స్క్రిప్షన్ చార్జీలను 20 నుంచి 60 శాతం తగ్గించింది. పెరుగుతున్న జీవన వ్యయం కారణంగా కుటుంబాలు వినోదాలకు చేసే ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. దీంతోపాటు ప్రత్యర్థి కంపెనీ నుంచి గట్టి పోటీని నెట్‌ఫ్లిక్స్ ఎదుర్కొంటోంది. దీంతో.. ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 116 countries
  • india
  • netflix
  • Netflix subscription prices
  • subscription rates

తాజావార్తలు

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..

  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్

  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..

  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions