Site icon NTV Telugu

Netanyahu: బైడెన్‌ తీరును తప్పుపట్టిన ఇజ్రాయెల్‌ ప్రధాని

Biden

Biden

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్-ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తాజాగా బైడెన్ వ్యాఖ్యలపై నెతన్యాహు స్పందించారు. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో హాట్ టాఫిక్‌గా మారింది.

తన సొంత దేశాన్నే గాయపరిచేలా నెతన్యాహు విధానాలు ఉన్నాయంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై నెతన్యాహు స్పందించారు. హమాస్‌తో పోరు విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలను ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తప్పుపట్టారు.

తాను మెజార్టీ ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నానని, దేశ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని బైడెన్ భావిస్తే.. అది పూర్తిగా తప్పు అని వ్యాఖ్యానించారు. హమాస్‌ లెక్కల ప్రకారం.. గాజాలో 31 వేలమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని.. ఈ సంఖ్య గురించి తనకెలా తెలుస్తుందని తెలిపారు.
ఇజ్రాయెల్ సైనికులు 13 వేల మంది మిలిటెంట్లను మాత్రమే హతమార్చారని నెతన్యాహు తెలిపారు.

ఇదిలా ఉంటే 1.3 మిలియన్ల పాలస్తీనీయులు ఆశ్రయం పొందుతున్న రఫా ప్రాంతాన్నీ ఇజ్రాయెల్‌ ఆక్రమించే అవకాశం ఉందన్న వార్తలపై బైడెన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంజమిన్‌ వైఖరి సొంత దేశాన్నే గాయపరుస్తోందని ఆక్షేపించారు. గాజాలో పౌరుల మరణాల విషయంలో ఇజ్రాయెల్‌ నిబంధనలకు కట్టుబడటం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇది చాలా పెద్ద పొరపాటని పేర్కొన్నారు.

అయినా ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు కొనసాగుతుందని బైడెన్ చెప్పుకొచ్చారు. ఆ దేశ రక్షణ, అక్కడి పౌరుల భద్రత చాలా కీలకమని వ్యాఖ్యానించారు. తన అభిప్రాయాన్ని నేరుగా ఇజ్రాయెల్‌ వెళ్లి అక్కడి పార్లమెంటుకే తెలియజేయాలనుకుంటున్నానని బైడెన్‌ వెల్లడించారు. అయితే ఆ పర్యటన ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని మాత్రం స్పష్టంగా తెలియజేయలేదు.

ఇదిలా ఉంటే ఇటీవల గాజాలో తిండి లేక ప్రజలు అలమటిస్తున్నారు. అయితే ఆయా దేశాలు ట్రక్కుల ద్వారా ఆహ్వారం అందిస్తున్నాయి. వాటి కోసం ప్రజలు ఎగబడుతున్న సమయంలో ఇజ్రాయెల్ దాడులు చేయడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయిరు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

Exit mobile version