Site icon NTV Telugu

Netanyahu’s ‘Love Story’: ఇండియాలో ఇజ్రాయెల్ ప్రధాని ‘లవ్ స్టోరీ’.. నవ్వు ఆపుకోలేకపోయిన పీఎం మోడీ!

Netanyahu's 'love Story'

Netanyahu's 'love Story'

Netanyahu’s ‘Love Story’: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటన రెండు దేశాల మధ్య సరికొత్త మైత్రికి నాంది పలికింది. విమానాశ్రయం నుంచి ఇజ్రాయెల్ పార్లమెంట్ వరకు మోడీకి లభించిన ఘన స్వాగతం ఈ పర్యటన ప్రాధాన్యతను చాటిచెప్పింది. పర్యటనలో భాగంగా నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తన వ్యక్తిగత విషయాన్ని ఒకటి పంచుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు.

READ ALSO: ప్రీమియం డిజైన్, పవర్‌ఫుల్ ఆడియోతో Samsung Galaxy Buds4 Series లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు మాట్లాడుతూ.. తన భార్యతో తన మొదటి డేట్ ఒక భారతీయ రెస్టారెంట్‌లో జరిగిందని, ఆ భోజనం అద్భుతంగా ఉండటం వల్లే వారి బంధం బలపడిందని సరదాగా వ్యాఖ్యానించారు. దీనికి తాను, తన పిల్లలు కూడా భారత్‌కు రుణపడి ఉంటామని ఆయన అనగానే ప్రధాని మోడీ నవ్వు ఆపుకోలేకపోయారు. భారతదేశంలోని అపారమైన ప్రతిభను, ఇజ్రాయెల్‌లోని సాంకేతిక పరిజ్ఞానాన్ని కలపడం ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చని ఇద్దరు నేతలు ఆకాంక్షించారు. ప్రధానంగా కచ్చితమైన వ్యవసాయం, సాఫ్ట్‌వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఆవిష్కరణలు, సాంకేతికత, అభివృద్ధికి సంబంధించి రెండు దేశాల మధ్య 16 కీలక అవగాహన ఒప్పందాలు (MoUలు) జరిగాయి.

తదుపరి సమావేశం భారత్‌లో..
రెండు దేశాల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేసేందుకు త్వరలోనే భారత్‌లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నేతలు నిర్ణయించారు. “మా వ్యక్తిగత స్నేహం, ప్రభుత్వాల మధ్య సహకారం, ప్రజల మధ్య అనుబంధం నానాటికీ బలపడుతోంది” అని నెతన్యాహు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దీనిని కొనసాగించేందుకు సాధ్యమైనంత త్వరగా భారతదేశంలో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పర్యటన కేవలం దౌత్యపరమైన ఒప్పందాలకు మాత్రమే పరిమితం కాకుండా, ఇద్దరు దేశాధినేతల మధ్య ఉన్న బలమైన వ్యక్తిగత స్నేహాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది.

READ ALSO: WEF President : ఎప్‌స్టీన్ ‘డార్క్’ లిస్ట్.. ప్రపంచ ఆర్థిక వేదిక బాస్ అవుట్.. ఆ విందులే కొంపముంచాయా?

Exit mobile version