Netanyahu’s ‘Love Story’: ఇండియాలో ఇజ్రాయెల్ ప్రధాని ‘లవ్ స్టోరీ’.. నవ్వు ఆపుకోలేకపోయిన పీఎం మోడీ!
Netanyahu’s ‘Love Story’: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటన రెండు దేశాల మధ్య సరికొత్త మైత్రికి నాంది పలికింది. విమానాశ్రయం నుంచి ఇజ్రాయెల్ పార్లమెంట్ వరకు మోడీకి లభించిన ఘన స్వాగతం ఈ పర్యటన ప్రాధాన్యతను చాటిచెప్పింది. పర్యటనలో భాగంగా నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తన వ్యక్తిగత విషయాన్ని ఒకటి పంచుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు.
READ ALSO: ప్రీమియం డిజైన్, పవర్‌ఫుల్ ఆడియోతో Samsung Galaxy Buds4 Series లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!
Also Read
- DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
- 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
- DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు మాట్లాడుతూ.. తన భార్యతో తన మొదటి డేట్ ఒక భారతీయ రెస్టారెంట్‌లో జరిగిందని, ఆ భోజనం అద్భుతంగా ఉండటం వల్లే వారి బంధం బలపడిందని సరదాగా వ్యాఖ్యానించారు. దీనికి తాను, తన పిల్లలు కూడా భారత్‌కు రుణపడి ఉంటామని ఆయన అనగానే ప్రధాని మోడీ నవ్వు ఆపుకోలేకపోయారు. భారతదేశంలోని అపారమైన ప్రతిభను, ఇజ్రాయెల్‌లోని సాంకేతిక పరిజ్ఞానాన్ని కలపడం ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చని ఇద్దరు నేతలు ఆకాంక్షించారు. ప్రధానంగా కచ్చితమైన వ్యవసాయం, సాఫ్ట్‌వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఆవిష్కరణలు, సాంకేతికత, అభివృద్ధికి సంబంధించి రెండు దేశాల మధ్య 16 కీలక అవగాహన ఒప్పందాలు (MoUలు) జరిగాయి.
తదుపరి సమావేశం భారత్‌లో..
రెండు దేశాల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేసేందుకు త్వరలోనే భారత్‌లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నేతలు నిర్ణయించారు. “మా వ్యక్తిగత స్నేహం, ప్రభుత్వాల మధ్య సహకారం, ప్రజల మధ్య అనుబంధం నానాటికీ బలపడుతోంది” అని నెతన్యాహు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దీనిని కొనసాగించేందుకు సాధ్యమైనంత త్వరగా భారతదేశంలో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పర్యటన కేవలం దౌత్యపరమైన ఒప్పందాలకు మాత్రమే పరిమితం కాకుండా, ఇద్దరు దేశాధినేతల మధ్య ఉన్న బలమైన వ్యక్తిగత స్నేహాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది.
READ ALSO: WEF President : ఎప్‌స్టీన్ ‘డార్క్’ లిస్ట్.. ప్రపంచ ఆర్థిక వేదిక బాస్ అవుట్.. ఆ విందులే కొంపముంచాయా?
తాజావార్తలు
-
Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
-
Crane Accident : శంకర్‌పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!