Hyderabad: నగరంలో మరోసారి నేపాలీ గ్యాంగ్ పంజా విసిరింది.. ఓనర్ ఇంట్లో లేని సమయం చూసి పక్కా స్కెచ్ వేసింది.. మరో నలుగురి సహాయంతో దోపిడీకి ప్లాన్ చేసింది. ఫంక్షన్ నుంచి ఓనర్ ఇంటికి రాగానే ప్లాన్ ఇంప్లిమెంట్ చేసింది. జ్యూస్ లో మత్తుమందు కలిపి ఇచ్చే ప్రయత్నం చేసింది.. జ్యూస్ తాగి ఓనర్ స్పృహ కోల్పోగానే ఇళ్లు మొత్తం దోచేసింది. బంగారం, నగదుతో ఉండాయించింది. ఈ ఘటన సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
READ MORE: Sabarimala: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు అలర్ట్.. ఈ జాగ్రత్తలు పాటించకపోతే ప్రాంణాంతక వ్యాధి..!
ఏసీపీ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. నేపాలి గ్యాంగ్ దొంగతనం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత నెల 21వ తేదీన నేపాలి దంపతులు రిటైర్డ్ కల్నల్ కిరణ్ ఇంట్లో పనిలో చేరారు. నిన్న ఫంక్షన్ కి వెళ్లి వచ్చిన అనంతరం ఇంట్లో ఉన్నవారికి మత్తు పదార్థం కలిపిన డ్రింక్ ఇచ్చారు. వాళ్లు మూర్చ పోయాక మరో నలుగురితో కలిసి దొంగతనానికి పాల్పడ్డారు. కల్నల్ మేల్కోవడంతో అతడిని తాళ్లతో కట్టేసి కర్రతో దాడి చేశారు. స్పృహ కోల్పోయినట్టు నటించడంతో 20 తులాల బంగారం, లక్ష రూపాయల నగదుతో కారులో వెళ్లిపోయారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. వాని పట్టుకునేందుకు మూడు టీంలను రంగంలోకి దింపారు.