Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్‌తో దోపిడీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్‌లో మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్ చేసింది. గల్ఫ్ ఎన్ క్లిప్‌లో ప్రొఫెసర్ విజయ లక్ష్మీ, మురళి మోహన్ దంపతులను కాళ్ళుచేతులు కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు. ఇంట్లో పని చేస్తున్న ఇద్దరు నేపాలీలతోపాటు, మరో ఐదు మంది కలిపి దోపిడీ చేశారు. ఇంట్లో ఉన్న 60 తులాల బంగారం, వెండి, 30 వేలు నగదు దోపిడీ చేశారు. 13 రోజుల క్రితమే ఇంట్లో పని మనుషులుగా చేరి దోపిడీ చేసింది ఈ నేపాలీ గ్యాంగ్. దోపిడీ సమయంలో సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు.
అసలు ఏం జరిగిందంటే?
సోమవారం రాత్రి నేపాలీ మహిళ జన్మదిన వేడుకలను ఇంట్లో చేసుకుంటామని అడగటంతో ప్రొఫెసర్ విజయ లక్ష్మీ, మురళి మోహన్ దంపతులు అంగీకరించారు. రాత్రి బర్త్‌డే వేడుకల పేరుతో ఇంట్లోకి మరో ముగ్గురు వచ్చారు. అనంతరం బర్త్‌డే కోసం ప్రొఫెసర్ దంపతులు కేక్ కోపించారు. వేడుకల పేరుతో ఇంట్లో దోపిడీకి ప్లాన్ చేశారు. ప్రొఫెసర్ దంపతులు భోజనం చేస్తున్న సమయంలో వెనుక నుంచి దాడి చేశారు. దంపతులను బెదిరించి చేతులు కట్టేశారు. “మీకు కావాల్సింది తీసుకెళ్లండి, మమ్మల్ని చంపకండి” అంటూ ఆ దంపతులు వేడుకున్నారు. దీంతో ఇంట్లో నగలు, విలువైన వస్తువులు దోచుకున్నారు. దోపిడీ అనంతరం దంపతులకు మత్తుమందు ఇచ్చి గదిలో బంధించారు. మత్తు ప్రభావంతో నిన్న మధ్యాహ్నం వరకు తేరుకోలేదు. మత్తు నుంచి తేరుకుని కిటికీ నుంచి అరవడంతో స్థానికులు తలుపులు తెరిచారు. ఇంటి తలుపులు తెరిచి దంపతులను రక్షించారు. ఈ విషయం తెలుకుని మల్కాజిగిరి సీపీ సుమతి ఘటనాస్థలికి చేరుకున్నారు. సీసీ ఫుటేజ్, పనిమనుషుల వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
- KCR Meeting : ఎర్రవల్లి వేదికగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్ ప్రక్షాళనకు శ్రీకారం..!
- Women Commission : తెలంగాణ మహిళా కమిషన్‌లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
తాజావార్తలు
-
Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్‌తో దోపిడీ!
-
Aadi Saikumar : ఆది సాయికుమార్ కొత్త సినిమా అనౌన్స్మెంట్: ‘శంభల’ టీమ్‌తో మరో క్రేజీ ప్రయోగం!
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Akshay Kumar: దిల్ రాజు – అక్షయ్ కుమార్ మూవీ రిలీజ్ డేట్ ఖరారు..
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!