Nepal : నేపాల్‌లోని బాగ్మతి ప్రావిన్స్‌లో బుధవారం తెల్లవారుజామున ప్రయాణీకుల బస్సు నదిలో పడిపోవడంతో ఒక మహిళతో సహా ఏడుగురు మరణించారు..మరో 30 మంది గాయపడ్డారు. ఘట్‌బేసి ప్రాంతంలో ఖాట్మండుకు వెళ్తున్న ప్యాసింజర్ బస్సు పై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో త్రిశూలి నదిలో పడిపోయింది. ధాడింగ్ జిల్లా పోలీసు కార్యాలయానికి చెందిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) గౌతమ్ కెసి ప్రకారం, ఈ ప్రమాదంలో ఒక మహిళతో సహా కనీసం ఏడుగురు మరణించారని ధృవీకరించారు. మరో 30 మంది ప్రయాణికులు ఈ ప్రమాదంలో గాయపడ్డారని తెలిపారు. ఈ వ్యక్తులను నేపాల్ పోలీసులు, సాయుధ పోలీసు దళం, నేపాల్ సైన్యంతో పాటు స్థానిక ప్రజలు రక్షించారు.
Read Also:Off The Record : T-Congress అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చిందా? లిస్ట్లో ఎవరున్నారు?
గాయపడిన వారిని రక్షించామని, స్థానిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స చేసిన తర్వాత, తదుపరి చికిత్స కోసం ఖాట్మండుకు తీసుకెళ్లామని గౌతమ్ కెసి చెప్పారు. మృతులను ఇంకా గుర్తించలేదు. బస్సు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బస్సు నదిలో పడి ప్రయాణికులకు గాయాలవడాన్ని బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. సాయుధ పోలీసు బలగాలు, చిట్వాన్‌లోని కురింతర్‌లోని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ట్రైనింగ్ స్కూల్‌కు చెందిన బృందం కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు నివేదిక పేర్కొంది.
Read Also:Off The Record : TDPలో కాలు పెట్టిన రోజే Gummanur Jayaram కాకరేపుతున్నారా..?