Nepal Political Crisis: నేపాల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ అరెస్ట్స్.. మాజీ ప్రధాని ఓలీ, మాజీ హోం మంత్రి అరెస్ట్!

  • ఖాట్మండు పాలిటిక్స్‌లో పెను సంచలనం
  • ఓలీ సామ్రాజ్యానికి బాలెన్ షా చెక్..
Nepal Political Crisis

Nepal Political Crisis

Nepal Political Crisis: నేపాల్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన 24 గంటల్లోనే రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. ప్రధానమంత్రి బాలెన్ షా నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ, మాజీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీతో పాటు మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్‌లను అరెస్ట్ చేసింది. గతంలో జరిగిన ‘జెన్-జి’ నిరసనల్లో విద్యార్థుల మరణాలకు వీరిద్దరే బాధ్యులని ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

READ ALSO: Off The Record : అంబటి రాంబాబు పెద్ద ప్లానింగ్ లో ఉన్నాడా..?

అరెస్టులకు దారితీసిన కారణాలు ఇవే..
ప్రధాని బాలెన్ షా అధ్యక్షతన జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలోనే విచారణ కమిషన్ నివేదికను అమలు చేయాలని నిర్ణయించారు. నిరసనల సమయంలో నిరాయుధులైన విద్యార్థులపై కాల్పులు జరపడం వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయారని, దీనికి అప్పటి పాలకులే బాధ్యులని నివేదిక స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రత్యక్ష చర్యలకు ఉపక్రమించింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. ఈ రోజు తెల్లవారుజామున ముందుగా మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీని కూడా అరెస్ట్ చేశారు. ఈ ఆకస్మిక పరిణామాలు నేపాల్ రాజకీయాల్లో ఒక కొత్త శకానికి సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు.

తదుపరి చర్యలు..
ఈ మరణాల్లో పోలీసు, సాయుధ దళాలు, సైన్యానికి చెందిన కొంతమంది అధికారుల ప్రమేయం ఉన్నట్లు కమిషన్ నివేదిక పేర్కొన్నప్పటికీ, వారిపై ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారుల పాత్రపై లోతైన దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని సమాచారం.

READ ALSO: Telangana: కీలక అలర్ట్.. ఆ జిల్లాలో మార్చి 28న బంద్.. కారణం ఇదే..