Nepal Floods: నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై మంత్రి లోకేష్ సమీక్ష.. ముగ్గురి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేపాల్‌లో మెరుపు వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికుల క్షేమ సమాచారంపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న ఏడుగురు ఏపీ యాత్రికుల పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీరిలో నలుగురు సురక్షితంగా ఉన్నారని, మరో ముగ్గురి ఆచూకీ ఇంకా లభించలేదని ఏపీ ఢిల్లీ భవన్ అధికారులు మంత్రికి వివరించారు. ఆచూకీ లభించని ముగ్గురిలో కుప్పం ప్రాంతానికి చెందిన బాల సుబ్రహ్మణ్యం, ఈషా ఫౌండేషన్ గ్రూప్‌కు చెందిన శశికుమార్, రాజ్యలక్ష్మి ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరి ఆచూకీ కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ చర్యలు ముమ్మరం చేయాలని మంత్రి లోకేష్ అధికారులను సూచించారు.
ఈషా ఫౌండేషన్‌కు చెందిన శశికుమార్ చివరిసారిగా చైనాలోని గైరోంగ్ ఎంబసీ వద్ద కనిపించినట్లు అధికారులు వెల్లడించారు. ఆయనను గుర్తించేందుకు చైనా, నేపాల్ అధికారులతో సమన్వయం కొనసాగించాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న కర్నూలు జిల్లాకు చెందిన భాస్కర్ శాస్త్రి సహా మరో ముగ్గురు యాత్రికులు క్షేమంగా ఉన్నారు. సురక్షితంగా ఉన్న యాత్రికులను వీలైనంత త్వరగా అక్కడి నుంచి తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని లోకేష్ అధికారులను ఆదేశించారు. యాత్రికుల భద్రతపై భారత రాయబార కార్యాలయంతో పాటు చైనా, నేపాల్ ఎంబసీలు, గైరోంగ్ ఇమ్మిగ్రేషన్ సెంటర్, ఈషా ఫౌండేషన్ ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ తాజా సమాచారాన్ని సేకరించాలని మంత్రి సూచించారు. ఆచూకీ లభించని ముగ్గురి కోసం ప్రత్యేకంగా సమన్వయ చర్యలు కొనసాగించాలని చెప్పారు.
Also Read
- IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
- Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
మరోవైపు నేపాల్‌లో చిక్కుకున్న యాత్రికులతో పాటు మానస సరోవర యాత్రకు వెళ్లిన ఏపీ వాసుల సమాచారం సేకరణను ఆర్టీజీఎస్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నట్లు ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ తెలిపారు. నేపాల్ వరదల నేపథ్యంలో ఏపీ యాత్రికుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సురక్షితంగా ఉన్న వారిని స్వస్థలాలకు తీసుకురావడంతో పాటు, ఆచూకీ లభించని ముగ్గురి జాడ కనుగొనే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయంతో సహాయక చర్యలు కొనసాగనున్నాయి.
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!