Nellore Acid Attack: బాలికపై అఘాయిత్యం.. యాసిడ్ దాడి.. పరిస్థితి విషమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దిశ వంటి చట్టాలు ఎన్నివచ్చినా.. కామాంధులు రెచ్చిపోతూనే వున్నారు. మహిళలు, పిల్లలపై, మైనర్ బాలికలపై దాడులు ఆగడం లేదు. తాజాగా నెల్లూరులో దారుణఘటన జరిగింది. ముక్కుపచ్చలారని చిన్నారుల్ని సైతం వారు వదలడం. అఘాయిత్యాలకు పాల్పడడం, ఎదురతిరిగితే దాడులకు తెగబడడం కామన్ అయిపోయింది.
నెల్లూరులో ఓ బాలిక ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. బాలిక గొంతు కోసి..యాసిడ్ దాడికి పాల్పడ్డాడో నిందితుడు. బాలిక ప్రతిఘటించడంతో కత్తితో దాడి చేశాడు. దీంతో బాలిక తీవ్రంగా గాయపడింది. బాలికపై యాసిడ్ పోసిన నిందితుడు నాగరాజును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యాసిడ్ దాడికి గురైన బాలిక పరిస్థితి విషమంగా వుందని తెలుస్తోంది. బాలికకు చికిత్స అందుతున్నా.. ఆహారం తీసుకోవడం ఆమెకు కష్టంగా వుందని వైద్యులు చెబుతున్నారు.
Also Read
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
- Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
- Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
- Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
వెంకటాచలం మండలంలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. బాధిత బాలిక ఓ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. బాలికను ఇంట్లోనే ఉంచి తల్లిదండ్రులు నిన్న సాయంత్రం బయటకు వెళ్లారు. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయాన్ని గుర్తించిన నాగరాజు అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. అతడి నుంచి తప్పించుకున్న బాలిక వాష్‌రూములోకి వెళ్లి తలుపులు మూసే ప్రయత్నం చేసింది. తలుపులు బలంగా నెట్టి లోపలికి వెళ్లిన నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆమె ఆ మృగాడినుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే, ప్రతిఘటించడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు నిందితుడు నాగరాజు. తన వెంట తెచ్చిన యాసిడ్‌ను ఆమె ముఖంపై, నోట్లోను పోశాడు. బాధతో బాలిక పెద్దగా కేకలు వేయడంతో గొంతు కోసి పరారయ్యాడు. చుట్టుపక్కల వారు వచ్చి జరిగిన ఘాతుకాన్ని చూసి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వెంటనే తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి చేరుకున్నారు. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న కుమార్తెను నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని గత రాత్రి నెల్లూరు ఎస్పీ సీహెచ్ విజయరావు, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పరామర్శించారు.
Read Also:Sonali Phogat Case: మరో ఊహించని ట్విస్ట్.. డైరీలో వారి పేర్లు
తాజావార్తలు
-
Vivo X500 Series: సెప్టెంబర్‌లో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు.. 200MP కెమెరా, 4K 240fps వీడియోతో అదరగొట్టనున్న వివో!
-
IRUMUDI : టికెట్ల అమ్మకాల్లో పెద్దిని దాటిన ‘ఇరుముడి’
-
Shivalayam Movie: రంగస్థలం ఫేమ్ ఆచంట మహేష్ హీరోగా ‘శివాలయం’ మూవీ!
-
Gold Price Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.1.63 లక్షలు దాటిన గోల్డ్ ధర
-
Shoriful Islam History: 140 ఏళ్లలో ఇదే తొలిసారి.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ స్టార్!
ట్రెండింగ్
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..