NTV Telugu Site icon

Nellore Court: ఎస్సైకి 6 నెలల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా..

Bombay High Court

Bombay High Court

Nellore Court: బిట్రగుంట ఎస్సై వెంకటరమణకు 6 నెలలు జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధించింది నెల్లూరు మొదటి అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు.. ఓ వ్యక్తిపట్ల దురుసుగా ప్రవర్తించిన ఎస్సై వెంకటరమణ.. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు కేసు నమోదైంది.. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఎస్ఐ వెంకటరమణపై బిట్రగుంట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.. తాను టీ తాగుతుండగా ఎస్ఐ వెంకటరమణ దౌర్జన్యం చేసి కొట్టాడంటూ ఓ బాధితుడి ఫిర్యాదు చేశారు.. 2016 జూన్ 24న బిట్రగుంటలోని టీస్టాల్ వద్ద ఈ ఘటన జరిగింది.. ఆ తర్వాత బాధితుడు ఫిర్యాదు చేయడం.. మానవహక్కులకు భంగం కలిగించారంటూ ఎస్ఐపై కేసు నమోదు చేయడం జరిగిపోగా.. తాజాగా ఈ కేసులో నెల్లూరు మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి తీర్పు వెలువరించారు.. బిట్రగుంట ఎస్సై వెంకటరమణకు 6 నెలలు జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తున్నట్టు తన తీర్పులో పేర్కొన్నారు.

Read Also: Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌